
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విలీన దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు.ఇందుకు సంబంధించిన జీవోనను వారం రోజుల్లోనే విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్మించిన గిరిజన , బంజారా భవన్‌లను ప్రారంభించారు కేసీఆర. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోడీ చేతులు జోడించి మొక్కుతున్నా… రిజర్వేషన్లకు గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తారో.. ఉరి వేసుకుంటారో మీ ఇష్టం అని కేసీఆర్ కామెంట్ చేశారు.
Also Read : నాణ్యతా లోపం విరిగిపడ్డ బ్రిడ్జ్…. రాకపోకలకు అంతరాయం, ఇబ్బంది పడుతున్న ప్రజలు.
గిరిజనులు, బంజారాల సమస్యల పరిష్కారం కోసం భవనాలు వేదిక కావాలన్నారు కేసీఆర్. గిరిజన రిజర్వేషన్ బిల్లును ఎందుకు తొక్కిపెడుతున్నారో.. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ బిల్లుకు రాజ్యాంగం అడ్డుగా లేదని తెలిపారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని తీర్మానం చేసి.. ఏడేళ్ల క్రితం కేంద్రానికి పంపామని ఆయన తెలిపారు. ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారో స్పష్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బిల్లుకు ఉన్న అడ్డంకి ఏమిటి.. రాజకీయాలు తప్ప అన్నారు. తమ న్యాయమైన హక్కునే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Read Also : బిజేపి నేతలతో అమిత్ షా భేటీ…. మునుగోడు ఉపఎన్నికపై దిశానిర్దేశం
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న దళిత బంధు మాదిరిగానే గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి గిరిజన బంధును త్వరలోనే అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ఇదివరకే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపినట్లు కేసీఆర్ తెలిపారు. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఈ విషయంపై స్పందనే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్రం ఆమోదంతో పని లేకుండానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
- అక్టోబర్ రెండు నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం… యాక్షన్ ప్లాన్ రెడీ
- పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం…. అవాస్తవమని తెలిపిన ఏపీ శాస్త్రవేత్తలు
- బిజేపికి వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సిల కలకలం….
- విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
- మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు