
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది కేసీఆర్ సర్కార్. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమైక్యత ర్యాలీలు తీశారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. అయితే జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్బంగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ విలీన దినం రోజు గిరిజనులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో నిర్మించిన సేవాలాల్ బంజారాభవన్, కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్ (ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గిరిజన రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేసే అవకాశముంది.
Read More : మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
ఉమ్మడి ఏపీలో గిరిజనుల జనాభా ప్రతిపదికన ఉన్న 6శాతం రిజర్వేషనే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని గిరిజనులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో గిరిజనుల జనాభా పెరిగిందని.. దానికి అనుగుణంగా రిజర్వేషన్ కూడా పెంచాలని కోరుతున్నారు. నిజానికి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా 9.34 శాతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వారి జనాభా 9.98 శాతంగా ఉంది. జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లను పెంచకపోవడంతో విద్య , ఉద్యోగాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.
Read More : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 సహా పలు పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో గిరిజన రిజర్వేషన్ల పెంపు డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు కూడా రిజర్వేషన్లను పెంచకపోతే.. తమకు అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలోనే గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే 12 శాతానికి కాకుండా.. 10శాతం రిజర్వేషన్ల ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి …
- తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి… సిఎం కేసిఆర్
- విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
- భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గం… బక్కని నర్సింహులు
- లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు!
- అడిగినంత విరాళం ఇవ్వలేదని కేరళ కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం…..ముగ్గురిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ