
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఇండియన్ యూనియన్ లో తెలంగాణ కలిసిపోయిన సెప్టెంబర్ 17ను టీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్కూల్ విద్యార్థులతో ర్యాలీలు తీశారు. అయితే సికింద్రాబాద్‌లో తప్పిదం జరిగింది. అవును విద్యార్థులకు అందజేసిన ఆహారం కుళ్లిపోయింది. దీంతో వారు వాసన చూసి వదిలేశారు.
Read More : మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు కుళ్ళిపోయిన భోజనాన్ని అందజేశారు. వాసన వస్తుండడంతో విద్యార్థులు కొద్దిగా తిని వదిలేశారు. ఎండలో ర్యాలీలో తిప్పి వారికి పాచిపోయిన ఆహారం పెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని తిట్టిపోస్తున్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల కోసం ప్రభుత్వం లక్షల డబ్బులు కేటాయించగా.. స్థానిక నేతల కక్కుర్తి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కానీ నేతలు అధికారులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఆహారాన్ని డస్ట్ బిన్‌లో వేశారు. అంతేకాదు వరి కంటపడకుండా విద్యార్ధులను కూడా పంపించేశారు.
ఇవి కూడా చదవండి …
- భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గం… బక్కని నర్సింహులు
- సెప్టెంబర్ 17న కేసీఆర్ సంచలన ప్రకటన?
- రేవంత్ రెడ్డి జీరో అవుతున్నారా.. సీనియర్లకే హైకమాండ్ వత్తాసా?
- గుజరాత్ మాజీ సిఎంతో ముఖ్యమంత్రి కేసిఆర్ భేటీ
- లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు!
One Comment