
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా 40 చోట్ల సాదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ , బెంగళూరు చెన్నైలోని పలు ప్రాంతాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్ రెడ్డి, బోయినపల్లి అభిషేక్, ప్రేమ్ సాగర్ రావుతో పాటు లిక్కర్ స్కాంలో ప్రధాన సూత్రధారిగా చెబుతున్న మద్యం వ్యాపారి అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. రాయదుర్గం దోమలగూడ సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దోమలగూడ శ్రీసాయికృష్ణా రెసిడెన్సీలో ఉన్న గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Also Read : మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో రెండుసార్లు తనిఖీలు చేశారు. గతంలో కోకాపేట్లోని రామచంద్ర పిళ్లై నివాసం నానక్రామ్గూడలోని రామచంద్ర పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టలరీస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాబిన్ డిస్టలరీస్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్.ఎల్.పి. పేరుతో రామచంద్ర పిళ్ల్లే కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఆయన సంస్థలో అభిషేక్, గండ్ర ప్రేమ్ సాగర్ రావు డైరెక్టర్లుగా ఉన్నారు. గతంలోనూ అభిషేక్ బోయినపల్లి… ఎమ్మెల్సీ కవిత పీఏగా పనిచేశారు. కేసీఆర్ కుమార్తె కవిత పర్సనల్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.
Read Also : అడిగినంత విరాళం ఇవ్వలేదని కేరళ కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం…..ముగ్గురిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
గతంలో కవిత పీఏ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కవిత పర్సనల్ ఆడిటర్.. హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలోని ఈడీ అధికారుల బృందం సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తోంది. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్గా కూడా పనిచేశారని చెబుతున్నారు. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్
వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని లోథీ రోడ్డులో 95వ నంబర్ నివాసంలో ఉంటున్న మాగుంట ఇంట్లో సోదాలు నిర్వహించారు. దీంతోపాటు నెల్లూరు నగరంలో రాయాజీ వీధిలో ఉన్న ఆయన నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాగుంట ఇంట్లోకి ఎవరినీ రానీయకుండా పోలీసులు భారీ భద్రత చేపట్టారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో సీబీఐ ఆగస్టు 19న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఐఏఎస్ అధికారి ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ నివాసాలతో పాటు ఏడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
ఇవి కూడా చదవండి :
- మునుగోడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్….
- పాత నేతలకు అవమానాలు.. కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ క్లాస్.. నెల రోజుల డెడ్ లైన్!
- రెండవ రోజు ప్రారంభమైన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం…. టిడిపి సభ్యుల సస్పెండ్
- దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో ఈడీ దాడులు…. తెలుగు రాష్ట్రాలతో సహ
- మునుగొడులో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి
One Comment