
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణలు మారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గ్రాఫ్ పార్టీలో రోజురోజుకు తగ్గుతున్న సంకేతం వస్తోంది. ఇటీవల కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయాలు తుస్సవుతుండగా.. సీనియర్ల మాటే చెల్లుబాటవుతోంది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి సూచించిన చల్లమల్ల కృష్ణారెడ్డిని కాదని.. సీనియర్లు ప్రతిపాదించిన పాల్వాయి స్రవంతికి హైకమాండ్ టికెట్ కేటాయించింది. తర్వాత కూడా పార్టీలో జరిగిన నిర్ణయాలు సీనియర్లకు సానుకూలంగా కనిపించాయి. తాజాగా మరో విషయంలో రేవంత్ రెడ్డి జీరోగా మిగిలిపోయారు. సీనియర్లే పంతం నెగ్గించుకున్నారు.
Read More : 2023 మేలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!
సెప్టెంబర్ 17 వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన టీపీసీసీ చీఫ్.. ఈసారి తాము సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు తెలంగాణకు ప్రత్యేక జెండాను తయారు చేసి ఎగురవేస్తామని ప్రకటించారు.అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటు రాష్ట్రగీతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే కొత్త తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణకు ప్రత్యేక జెండాను ఆవిష్కరిస్తామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయంపై కాంగ్రెస్‌లోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ రకమైన నిర్ణయాల వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని.. అయినా ఇలాంటివి కాంగ్రెస్ విధానం కాదని వాళ్లు రేవంత్ రెడ్డికి సూచించినట్టు సమాచారం.
Read More : ఆస్థి తగాదా… పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య ప్రయత్నం.
అయితే ఆ నేతల సూచనలను రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడంతో.. వారంతా రేవంత్ రెడ్డికి నచ్చజెప్పగలిగే స్థాయిలో ఉన్న ఓ సీనియర్ నేతను సంప్రదించి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆయన రంగంలోకి దిగి రేవంత్ రెడ్డికి ఈ అంశంపై పలు సూచనలు చేశారని.. సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణకు ప్రత్యేక జెండా అనే అంశాన్ని పక్కనపెట్టాలని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఈ విషయంలో వ్యతిరేకంగా ఉండటంతో.. రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంలో కాస్త మెత్తబడ్డారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి రేపు కేవలం గాంధీభవన్‌లో జెండాను మాత్రమే ఆవిష్కరిస్తారని.. తెలంగాణ తల్లి, తెలంగాణకు ప్రత్యేక జెండా ఆవిష్కరణ ఉండదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు ఇప్పటికప్పుడు ఈ అంశంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినా.. రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే భావనలో ఆయనలో ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌లోని సీనియర్లు మరోసారి రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
- భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గం… బక్కని నర్సింహులు
- లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు!
- బిగ్ బ్రేకింగ్: టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా
- కారెక్కుతున్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు.. మునుగోడులో ఖాళీ అవుతున్న కాంగ్రెస్