
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : రెండవ రోజు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా మొదలయ్యాయి. ఉదయం సభ ప్రారంభంకాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం టీడీపీ నిత్యావసరాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. నినాదాలతో మంత్రులు, స్పీకర్ ప్రసంగాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభ సజావుగా సాగాలనే విజ్ఞప్తులను వాళ్లు ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి సస్పెండ్ చేశారు.
Read Also : మునుగోడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్….
సభా కార్యక్రమాలకు పదే పదే ఆటకం కల్గిస్తుండటంతో ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే వీరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు కాగా.. మళ్లీ తిరిగి సోమవారం ప్రారంభమవుతుంది. టీడీపీ సభ్యులు మళ్లీ సోమవారం సభకు హాజరుకానున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టింది. సభ ముందుకు సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, పంచాయితీ రాజ్ సవరణ బిల్లు.. ఇతరాలు వచ్చాయి. అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పైనా కొనసాగుతున్న స్వల్ప చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి :
- దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో ఈడీ దాడులు…. తెలుగు రాష్ట్రాలతో సహ
- పాత నేతలకు అవమానాలు.. కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ క్లాస్.. నెల రోజుల డెడ్ లైన్!
- మునుగొడులో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి
- వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?
- చంద్రబాబులో ఆ మార్పుతో – ఊహించని విధంగా..!!