
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పేరు తెలియని వారు ఉండరు. రాజకీయాలలో నవ్వుల పువ్వులు పూయించే కేఏ పాల్ ఏం చేసినా ఒక సంచలనమే. అయితే ఇటీవల కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ రద్దు చేస్తున్నట్టుగా, నిష్క్రియ పార్టీల జాబితాలో చేర్చినట్టుగా భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కె ఏ పాల్ పేరు మళ్లీ తెర మీదికి వచ్చింది. అయితే తన పార్టీ రద్దు కాలేదని ప్రజాశాంతి పార్టీ రద్దయిందని జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని కేఏ పాల్ వెల్లడించారు. కేవలం తమ పార్టీకి నోటీసులు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్న కేఏ పాల్, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో కె ఏ పాల్ మునుగోడు ఉప ఎన్నిక పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో ఈడీ దాడులు…. తెలుగు రాష్ట్రాలతో సహ
తాను మునుగోడును వదిలిపెట్టేది లేదని కేఏ పాల్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధి తన వల్లే సాధ్యం అవుతుందని కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీని ఆదరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకపక్క పార్టీనే లేదంటున్నా అదేమీ లేదని చెప్పి తనదైన ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుగోడు ఉప ఎన్నిక పై అందరి దృష్టి ప్రధానంగా నెలకొంది. మునుగోడు లో జండా ఎగరవేయడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరికి వారు మునుగోడు ను కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు రాజకీయాల్లో వేలు పెట్టిన కె ఏ పాల్ ఇప్పటికే మునుగోడులో వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : పాత నేతలకు అవమానాలు.. కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ క్లాస్.. నెల రోజుల డెడ్ లైన్!
మునుగోడులో తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని, మునుగోడులో ప్రజాశాంతి పార్టీ గెలిచిన ఆరు నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు ఉచిత విద్యను అందిస్తామన్నారు. మునుగోడు లోని ప్రతి గ్రామంలో తన చారిటీ ద్వారా ఉద్యోగాలు ఇస్తానని ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక తాజాగా ఈనెల 25వ తేదీన తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు యువకులకు కేఏపాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా యాభై తొమ్మిది మందికి డ్రా ద్వారా పాస్ పోర్టులు ఇప్పించి విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసాలు తెప్పిస్తానని కె ఏ పాల్ ప్రకటించారు. మరో ఏడు వేల మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక కేఏ పాల్ తాజా వ్యాఖ్యలపై, ఆయన రాజకీయ పార్టీ పరిస్థితి పై జనాలు చలోక్తులు విసురుతున్నారు.
ఇవి కూడా చదవండి :
మునుగొడులో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి
హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్
తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బిజేపిలోకి వెంకట్ రెడ్డి
కోమటిరెడ్డికి షాకుల మీద షాకులు.. బీజేపీ పెద్దలకు మునుగోడు టెన్షన్
లైంగిక వేదింపుల ఆరోపణలతో శ్రీ గురు మడివాళేశ్వర మఠం పీఠాధిపతి ఆత్మహత్య…