
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీకి ఏఐసీసీ భారీ షాకిచ్చింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచార కమిటీ కన్వీనర్ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు నియోజకవర్గంలో విజయం సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించి పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
Also Read : పాత నేతలకు అవమానాలు.. కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ క్లాస్.. నెల రోజుల డెడ్ లైన్!
ఈ నేపథ్యంలో మధుయాష్కీకి మునుగోడు ఉపఎన్నిక ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. నేతలతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ సరిగ్గా పాల్గొనడం లేదు. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధిష్ఠానం మధుయాష్కీని బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో మునుగోడు ఉపఎన్నిక వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌గా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
- అడిగినంత విరాళం ఇవ్వలేదని కేరళ కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం…..ముగ్గురిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్
- రెండవ రోజు ప్రారంభమైన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం…. టిడిపి సభ్యుల సస్పెండ్
- మునుగోడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్….
- దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో ఈడీ దాడులు…. తెలుగు రాష్ట్రాలతో సహ
2 Comments