
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : ఒకే రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గమని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింలు అన్నారు. చర్లగూడెం జలాశయం భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ జలాశయ నిర్మాణానికి శంకుస్తాపన చేసిన పైలాన్ నుండి మర్రిగూడ తహసీల్దార్ కార్యలయం వరకు 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.
Read Also : రేవంత్ రెడ్డి జీరో అవుతున్నారా.. సీనియర్లకే హైకమాండ్ వత్తాసా?
ఈపాదయాత్ర లో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింలు పాల్గొని మాట్లాడారు. నీళ్ళు, నిధులు, నియమకాలో వివక్షతతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి వివక్షత, పక్షపాతం చూపించడంతో ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశాలుంటాయని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి రెండున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని ఇప్పటివరకు కనీసం నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు కక్కుర్తి పడి 40 వేల కోట్ల అంచనా తో పనులు ప్రారంభించి 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు.
Also Read : గుజరాత్ మాజీ సిఎంతో ముఖ్యమంత్రి కేసిఆర్ భేటీ
మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఏకారకు 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించి ఇక్కడ ఎందుకు ఎకరాకు ఐదు లక్షలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఏడు లక్షలు ఇస్తున్నరో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. చర్లగూడెం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనేక పర్యాయాలు విన్నవించిన స్పందన లేదన్నారు. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాల మేడలు వంచాలని అందుకు తెలుగుదేశం పార్టీ ప్రజల వెంట ఉంటుందన్నారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కృష్ణా జలాల కేటాయింపులో కేంద్రం అన్యాయం చేస్తుందనే కొత్తపల్లవిని కేసిఆర్ అందుకున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి లు కూర్చొని కృష్ణా జలాల కేటాయింపులు ఎందుకు చేసుకుంటలేరని వివాదాలు పరిష్కారం చేసుకుంటలేరని ప్రశ్నించారు .ప్రజలను మోసగించేందుకు ముఖ్యమంత్రిలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Read Also : లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు!
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం తమ భూములను ప్రాజెక్టుకు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులకు అన్యాయం చేస్తే పుట్టగతులు ఉండవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన సమయంలో మార్కెట్ కంటే ఐదు రెట్లు ధర భూమికి చెల్లిస్తానని, ఇంట్లో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇస్తానని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు .
ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఇండ్లు కోల్పోలేదని వారిని విస్మరించడం తగదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు. డిండి ప్రాజెక్టు నిర్మాణం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తుందని తక్షణమే నిధులు కేటాయించి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేయాలని అంతవరకు టీడీపీ పోరాటం చేస్తుందని అన్నారు.
Also Read : మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
నాయకుల కొనుగోలు మీద ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యల మీద బిజెపి, టీఆర్ఎస్ పార్టీలకు లేదని అధికారంలో ఉండి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రజలను మభ్యపెట్టడానికి, డబ్బులు వెదురుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కుందారపు కృష్ణమాచారి, దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాల ఇంచార్జులు విజయ నాయక్, యాతాకు అంజయ్య, రాష్ట్ర కార్యదర్శులు జలముని రవీందర్, మన్నె సంజీవరావు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కుక్కల నరసింహ, పార్లమెంటు అధికార ప్రతినిధి మక్కెన అప్పారావు, పార్లమెంటు కార్యదర్శి గుమ్మడి గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దోమల వెంకన్న, ఏర్పుల సుదర్శన్ఎర్రజెళ్ళ లింగయ్య, నాయకులు, పగడాల లింగయ్య, ముద్ధం శ్రీనివాస్ గౌడ్ , గోసుకొండ వెంకటేశం, పుప్పాల యాదయ్య, నల్ల సత్యం, ఎండి షరీఫ్, ఈద కృష్ణ, కాసర్ల అంజయ్య, బూరెల మల్లేశం, సిలివేరు నరసింహ, మారుగోని అశోక్, తడక కోటేష్, అవ్వారు సుబ్బారావు, గంట అంజయ్య, ముత్యాల చంద్రయ్య, పగిళ్ల రవీందర్, స్వామి, బద్దుల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్
- మునుగోడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్…
- పాత నేతలకు అవమానాలు.. కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ క్లాస్.. నెల రోజుల డెడ్ లైన్!
- రెండవ రోజు ప్రారంభమైన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం…. టిడిపి సభ్యుల సస్పెండ్
- అడిగినంత విరాళం ఇవ్వలేదని కేరళ కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం…..ముగ్గురిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
One Comment