
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి శంకర్ సింగ్ వాఘేలా శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు.జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెను మార్పు తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేషనల్ పాలిటిక్స్‌పై సీఎం కేసీఆర్ సీరియస్ నెస్ పెంచారు. వరసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Read Also : మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
ముందుగా ప్రాంతీయ పార్టీ అధినేతలను కలుస్తున్నారు. బీజేపీ ముక్త భారత్నినాదాన్ని ప్రజల్లోకి సీఎం కేసీఆర్ బలంగా తీసుకెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలువడం.. ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు రావాలని కోరుతున్నారు. శంకర్ సింగ్ వాఘేలా ఇటీవల కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ సింగ్ వాఘేలా తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపుతారు. 182 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని శంకర్ సింగ్ వాఘేలా ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : అడిగినంత విరాళం ఇవ్వలేదని కేరళ కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం…..ముగ్గురిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
జాతీయ రాజకీయాలు, బీజేపీ కబంద హస్తాల నుంచి దేశాన్ని కాపాడాలని వారిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారుతుందని అప్పట్లో చర్చ జరిగింది. కానీ కొత్త పార్టీలో రైతు పేరు వచ్చేలా మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది. పార్టీ జెండా వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా ఆకుపచ్చ రంగులో ఉండవచ్చని సమాచారం. ఎన్నికల గుర్తు విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై క్షేత్రస్థాయిలో చర్చ జరిగి.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇవి కూడా చదవండి :
- లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు!
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్
- మునుగోడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్….
- పాత నేతలకు అవమానాలు.. కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ క్లాస్.. నెల రోజుల డెడ్ లైన్!
- రెండవ రోజు ప్రారంభమైన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం…. టిడిపి సభ్యుల సస్పెండ్