
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కోసం రూ.2000లు ఇవ్వలేదని ఓ కూరగాయల వ్యాపారిపై కేరళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. షాపులో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సుధాకరన్ ముగ్గురు కార్యకర్తలను శుక్రవారం సస్పెండ్ చేశారు.
Read Also : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్
కొల్లాంలో అడిగినంత విరాళం ఇవ్వలేదని కాంగ్రెస్ కార్యకర్తలు కూరగాయల వ్యాపారిపై దాడికి దిగారు. ఆ వ్యాపారి షాపును ఏకంగా ధ్వంసం చేశారు. భారత్ జోడో యాత్ర కోసం రెండు వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కానీ ఆ కూరగాయల వ్యాపారి రూ.500లు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. దాంతో విరాళం పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని ఆ వ్యాపారి ఆరోపణలు చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని.. తన షాపుకు వచ్చిన కస్టమర్లను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : రెండవ రోజు ప్రారంభమైన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం…. టిడిపి సభ్యుల సస్పెండ్
ఆ గ్యాంగ్‌లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హెచ్. అనీశ్ ఖాన్ ఉన్నట్టు వ్యాపారి ఫవజ్ ఆరోపించాడు. “కాంగ్రెస్ కార్యకర్తల బృందం దుకాణానికి వచ్చి.. భారత్ జోడో యాత్ర కోసం విరాళం అడిగారు. నేను రూ. 500 ఇచ్చాను. కానీ వారు రూ. 2,000 డిమాండ్ చేశారు. కోపంతో వారు తూకం చేసే యంత్రాలను పాడు చేసి, కూరగాయలను విసిరారు.” అని షాపు యజమాని ఎస్. ఫవాజ్ చెప్పారు.
Read Also : మునుగోడు యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్….
అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వారిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సుధాకరన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. “కొల్లాంలో ఆమోదయోగ్యం కానీ ఘటనలో పాల్గొన్న ముగ్గురు పార్టీ కార్యకర్తలు తక్షణమే సస్పెండ్ చేశాం. వారు మా సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించరు. అలాంటి ప్రవర్తన క్షమించరానిది.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు కూడా నమోదు అయింది.
ఇవి కూడా చదవండి :
- దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో ఈడీ దాడులు…. తెలుగు రాష్ట్రాలతో సహ
- పాత నేతలకు అవమానాలు.. కోమటిరెడ్డికి బీజేపీ హైకమాండ్ క్లాస్.. నెల రోజుల డెడ్ లైన్!
- మునుగొడులో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి
- హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్

One Comment