
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాదులోని ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృత్యువాత పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్స్ షోరూంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో పైన ఉన్న హోటల్ లోకి మంటలు వ్యాప్తి చెందటంతో దట్టమైన పొగ కారణంగా అందులో బస చేసిన పర్యాటకులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేయగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
Read Also : కేసిఆర్ సవాలుకు బండి సంజయ్ ప్రతిసవాల్
Also Read : బిజేపిని చూసి కేసిఆర్ భయపడుతున్నాడు.. అందుకే మోడిపై విమర్శలు.. ఈటల రాజేందర్
సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పై మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బిల్డింగ్ ప్లాన్ ను మిస్ యూస్ చేశారని మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు . అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయని 8 మంది పొగ కారణంగానే చనిపోయారు అంటూ తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్న మహమూద్ అలీ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు . మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ బైక్ షోరూం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్
- కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు….
- తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బిజేపిలోకి వెంకట్ రెడ్డి
- కోమటిరెడ్డికి షాకుల మీద షాకులు.. బీజేపీ పెద్దలకు మునుగోడు టెన్షన్
- వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?