
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మునుగొడులో ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించిన చివరకు గెలిచేది మాత్రం టిఆర్ఎస్ పార్టీ అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం, గట్టుపల్ మండల కేంద్రలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.
Read Also : మంత్రి కేటిఆర్ తో విఆర్ఏల చర్చలు.. వారం రోజులు వేచి చూడాలన్న కేటిఆర్
అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే మునుగోడు దశ తిరిగిందని, ఫ్లోరైడ్ అంతం అయిందని అన్నారు. బీజేపీ నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణపై దాడి చేస్తున్నరని ఆరోపించారు. ఈ దేశంలో కేసీఆర్‌ను ఆపే శక్తి ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో మునుగోడులో కరువు తాండవించిందని, ఫ్లోరైడ్ భూతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
Also Read : వజ్రోత్సవ మహాసభ విజయవంతం చేయాలి
ఇతర రాష్ట్రాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ తమకు కావాలని అడుగుతున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎదుగుతున్నందుకే కేంద్రం కేసీఆర్‌ను చూసి ఓర్వలేకపోతుందన్నారు. అందుకే తెలంగాణపై విషం చిమ్ముతున్నదని ఆరోపించారు. మునుగోడులో గెలిచేది తామేనని.. టీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :
- ఉద్రిక్తంగా మారిన విఆర్ఏల అసెంబ్లీ ముట్టడి……
- ఈటల సస్పెన్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్….
- చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
- ఈటల రాజేందర్ పై వేటు.. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
- మృతులకు కేంద్రం రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల పరిహారం….

One Comment