
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని తెలంగాణ అసెంబ్లీ నుంచిసస్పెండ్ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీకర్‌ను మరమనిషి అంటేనే సభ నుంచి సస్పెండ్ చేసేస్తారా? అని నిలదీశారు.
Also Read : చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
తనను మరమనిషంటేనే కోపగించుకుని ఈటల రాజేందర్‌ని సస్పెండ్ చేసిన స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డి నిండు సభలో దేశ ప్రధానిని ఫాసిస్ట్ అంటూ తిట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ నిలదీశారు. మోదీ పట్ల సంస్కార హీనంగా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు.
Read Also : ఈటల రాజేందర్ పై వేటు.. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
ఈటల సస్పెన్షన్ అంశాన్ని చట్టపరంగా ఎదుర్కొని కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఇదిలా వుంటే సస్పెన్షన్ అనంతరం రాజేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిన అనంతరం తనను బలవంతంగా పోలీసు వాహనంలో తరలించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్ఏగా గెలిచిన నాటి నుండి ఇప్పటివరకు తనను అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారని, కేసిఆర్ ను గద్దెదించే వరకు విశ్రమించనని, టిఆర్ఎస్ నాయకుల తాటాకు చప్పులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- మృతులకు కేంద్రం రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల పరిహారం….
- కేసిఆర్ సవాలుకు బండి సంజయ్ ప్రతిసవాల్
- బిజేపిని చూసి కేసిఆర్ భయపడుతున్నాడు.. అందుకే మోడిపై విమర్శలు.. ఈటల రాజేందర్
- హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్
- తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బిజేపిలోకి వెంకట్ రెడ్డి
One Comment