
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీజేపీని చూసి భయపడుతున్న కేసీఆర్, ప్రధాని మోడీని విమర్శిస్తున్నాడని సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనను శాసన సభకు రానివ్వనని కెసిఆర్ అనుకున్నట్టున్నాడు కానీ కేసీఆర్ ని సభకు రాకుండా చేసే బాధ్యత నాదేనంటూ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. కచ్చితంగా కేసీఆర్ కు బుద్ధి చెప్పి తీరుతానన్నారు.
Read Also : హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్
ప్రధాని నరేంద్రమోడీపై సభా వేదికగా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కేసీఆర్ ఎన్ని రోజులు మోటార్లకు మీటర్ ల గురించి మాట్లాడతారు అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దుబ్బాక లో గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడతారని ప్రచారం చేశారని, హుజురాబాద్ లోనూ బీజేపీ గెలిస్తే విద్యుత్ మోటార్లకు మీటర్లు వస్తాయని, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారని, కానీ మరి రెండు చోట్ల విద్యుత్ మోటార్ లకు మీటర్లు ఎందుకు రాలేదో ప్రజలకు చెప్పి తీరాలని ఆయన అన్నారు. బీజేపీని చూసి భయపడుతున్న కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ నేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Also Read : కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు….
రాష్ట్రంలో విద్యుత్ మోటార్ లకు మీటర్లు రాలేదు కానీ, కరెంటు బిల్లుల మోత రాష్ట్రంలో మోగిపోతుంది అంటూ, విపరీతంగా పెంచిన కరెంటు బిల్లులతో రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తలకిందులుగా తపస్సు చేసినా సరే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది భారతీయ జనతా పార్టీనే అని తేల్చి చెప్పారు. ప్రజలలో సీఎం కేసీఆర్ పట్ల, టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్న ఈటల రాజేందర్, కెసిఆర్ ప్రభుత్వం ఫీజు పీకవలసిన సమయం ఆసన్నమైందని, ఆ పని ప్రజలందరూ చేయాలని పిలుపునిచ్చారు.
Read Also : నేటి నుంచి బండి సంజయ్ నాల్గోవ విడత పాదయాత్ర…
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరుకాలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేపథ్యంలో ఈటల రాజేందర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. మరోవైపు ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నెల ఆరవ తేదీన స్పీకర్ ను మరమనిషిలా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను ఈటల సమర్ధించుకున్నారు. దీంతో నిండు సభలో ఈటల పై తీర్మానం పెడతారని పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈటల తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇవి కూడా చదవండి :
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు… ఏకకాలంలో 50 చోట్ల
సిపిఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా సాంబశివరావు…..
తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బిజేపిలోకి వెంకట్ రెడ్డి
కోమటిరెడ్డికి షాకుల మీద షాకులు.. బీజేపీ పెద్దలకు మునుగోడు టెన్షన్
ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం