
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బిజేపి రాష్ట్ర అద్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నేడు అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కుత్బుల్లాపూర్ లో ప్రారంభమైన నేపథ్యంలో, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ కెసిఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన సవాల్ స్వీకరిస్తున్నానని బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు. కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లులోవ్యవసాయ మోటర్లకు మీటర్ల అంశం ఉందని, లేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కెసిఆర్ చేసిన సవాల్ కు బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు. ముగ్గురి కబంధ హస్తాలలో బంధీ అయి రోదిస్తున్నతెలంగాణ తల్లికివిముక్తి కల్పించడానికే తాను ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నట్టుగా బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also : బిజేపిని చూసి కేసిఆర్ భయపడుతున్నాడు.. అందుకే మోడిపై విమర్శలు.. ఈటల రాజేందర్
హైదరాబాద్ ను న్యూయార్క్ , సింగపూర్ చేస్తానన్న సీఎం కేసీఆర్ అది ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. చిన్న వర్షం వస్తేనే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్న బండి సంజయ్ సిటీలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్న కేసీఆర్ కు హైదరాబాద్ సిటీ లో ఉన్న గుంతలు మొత్తం చూపిస్తే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17 వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరగడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని జరిపి తీరుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లులో మీటర్ల అంశం లేదని, కెసిఆర్ తప్పుడు పత్రాలు తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.
Also Read : హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు…
సీఎం కేసీఆర్అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని పట్టుకొని తిరుగుతున్నాడని పేర్కొన్నారు. కెసిఆర్ బీఆర్ఎస్ కాదు పీఆర్ఎస్ పెట్టుకుని కెఏ పాల్ తో కలిసి తిరిగినా ఎలాంటి సమస్య లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలిచేది బీజేపీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అని ముద్ర వేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పి తీరుతారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలని పరిష్కరించలేని కేసీఆర్ దేశ రాజకీయాలు చేస్తారా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు….
నేటి నుంచి బండి సంజయ్ నాల్గోవ విడత పాదయాత్ర…
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు… ఏకకాలంలో 50 చోట్ల
తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బిజేపిలోకి వెంకట్ రెడ్డి
మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్