Telangana

వినాయక మండపాలను సందర్శించిన కూసుకుంట్ల.

క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ స్థాయిలో గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితిలో ఎటువంటి ఆటంకాలకు, గొడవలకు తావు లేకుండా పూర్తి చేసుకోవాలని కోరారు. మానసిక ఉల్లాసం, మనశ్శాంతి దైవ ప్రార్థనతోనే లభిస్తాయని అన్నారు.

Read Also : సినీనటి దివ్యవాణి బి‌జే‌పిలో చేరిక….???

యువత సన్మార్గంలో నడుస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, నవరాత్రులలో ఐకమత్యంగా ఉన్నట్లే, ప్రతి చోట కూడా ఐకమత్యంగా ఉండాలని కోరారు.
పల్లెలు పట్నాలు అని తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా నిర్వహించుకునే ఈ పండుగకు హాజరై పూజల్లో పాల్గొన్నారు. తన వంతుగా వినాయక చందా రూపంలో, మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలోని వినాయక మండపాలకు పదివేల రూపాయలు వారి అనుచరులతో అందించారు. ఈ సందర్భంగా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామపంచాయతీ నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి యూత్, శ్రీ హనుమాన్ యూత్ మండపాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read : వచ్చే మూడు రోజులు కుండపోతే… జనాలు బయటికి రావొద్దని హెచ్చరిక

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రజలు మండపాల వద్ద శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమాలలో మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, మాల్ మార్కెట్ చైర్మన్ దంటు జగన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోటకూరి శంకర్, పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ పందుల యాదయ్య, ఎఫ్.ఎస్.సి.ఎస్ చైర్మన్ బాలం నరసింహ, వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఎడ్ల శ్రీరాములు, బీసీ సెల్ మండల అధ్యక్షులు కారింగు నరసింహ, సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు కొండ్రెడ్డి గిరి, మోడల్ స్కూల్ చైర్మన్ పందుల కృష్ణ, నాయకులు మామిడి కృష్ణ, కార్యకర్తలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు!
  2. సి‌పి‌ఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా సాంబశివరావు…..
  3. ప్రజల శ్రేయస్సే ముఖ్యం… విభేదాలు అనవసరం….. గవర్నర్ తమిళసై
  4. తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బి‌జే‌పిలోకి వెంకట్ రెడ్డి
  5. కోమటిరెడ్డికి షాకుల మీద షాకులు.. బీజేపీ పెద్దలకు మునుగోడు టెన్షన్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.