
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడటంతో, నిడమనూరు, ముప్పారం గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. వందల ఎకరాల పంట నీటమునిగింది. ఎడమ కాలువకు గండి పడటంతో ఒక్కసారిగా ముంచెత్తిన వరద తో నిడమనూరు మినీ గురుకుల హాస్టల్ లోకి వరద నీరు చేరింది. దీంతో నిడమనూరు గుంటుక గూడెం, నరసింహులు గూడెం గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు గురుకుల హాస్టల్ లో ఉన్న 87 మంది విద్యార్థులను ఒక ఫంక్షన్ హాల్ లో కి తరలించి, ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టారు. వరద ఉధృతి కారణంగా నిడమనూరు, ముప్పారం గ్రామాలలో సుమారు 20 ఇళ్లు జలమయమయ్యాయి. మిర్యాలగూడ నుండి దేవరకొండ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read : ఇలా చేస్తే రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్ జంప్ వంటి ఈవెంట్స్‌లో సక్సెస్ మీదే
దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఎడమ కాలువకు గండి పడిన నేపథ్యంలో, ప్రమాదాన్ని నివారించడం కోసం అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చెయ్యటాన్ని నిలిపివేశారు. అప్పటికే వస్తున్న వరదను హాలియా వద్ద దారి మళ్లించిన అధికారులు ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కోదాడ-జడ్చర్ల హైవే (మిర్యాలగూడ-దేవరకొండ రహదారి) ప్రస్తుతం జలమయంగా ఉందని, దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ సీఈ శ్రీకాంతరావు విలేకరులతో మాట్లాడుతూ కాలువకు గండి పడడంతో వెంటనే నీటి విడుదలను నిలిపివేసినట్లు తెలిపారు. వరద నీరు దాదాపు తగ్గుముఖం పట్టిందని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని, మూడు రోజుల్లో కాలువ మరమ్మతులు పూర్తి చేస్తామని సీఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?
- సద్ది కట్టుకుని హిందువులు ట్యాంక్ బండ్ రావాలని బండి సంజయ్ పిలుపు
- కోమటిరెడ్డికి షాకుల మీద షాకులు.. బీజేపీ పెద్దలకు మునుగోడు టెన్షన్
- ఈటల సభ్యత్వానికి రంఘం సిద్దం… స్పీకర్ పై అనుచిత వ్యక్యలే కారణమా..???
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసిఆర్ ఆలయాలు నిర్మిస్తా….. కేసిఆర్ అభిమాని