
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సినీ నటి దివ్యవాణీ రాజకీయంగా మరోపార్టీలో చేరిక ఖాయమైంది. టీడీపీలో పని చేసి రాజీనామా చేసిన దివ్యవాణీ ఇప్పుడు బీజేపీలో చేరేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. తెలంగాణ లో బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దివ్య వాణీ సమావేశమయ్యారు. పార్టీలో చేరిక పైన చర్చించారు. అయితే, పార్టీలో ఏ రకంగా దివ్య వాణీ సేవలు వినియోగించుకోవాలనే అంశంతో పాటుగా పార్టీలో బాధ్యతల పైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజేందర్ స్పష్టం చేసారు.
Also Read : తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బిజేపిలోకి వెంకట్ రెడ్డి
దివ్యవాణీ తమిళ – కన్నడ ప్రాంతాలతోనూ సంబంధాలు ఉండటంతో.. పార్టీ ప్రచారానికి వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకీ బలపడుతోందని.. త్వరలోనే తాను పార్టీలో చేరే అంశం పైన అన్నీ చెబుతానని దివ్యవాణీ చెప్పుకొచ్చారు. అయితే, ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపధ్యంలో ఆయన సమక్షంలో కొందరు పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే దివ్యవాణీ సైతం కాషాయం కండువా కప్పుకొనే ఛాన్స్ ఉందని సమాచారం. త్వరలోనే బండి సంజయ్ తోనూ దివ్య వాణీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో దివ్య వాణీ పార్టీలో చేరిక ముహూర్తం ఫైనల్ అవుతుందని సమాచారం.
ఇవి కూడా చదవండి :
- నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి…. వందల ఎకరాల పంట నష్టం
- ఇలా చేస్తే రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్ జంప్ వంటి ఈవెంట్స్‌లో సక్సెస్ మీదే
- వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?
- సద్ది కట్టుకుని హిందువులు ట్యాంక్ బండ్ రావాలని బండి సంజయ్ పిలుపు
- ఈటల సభ్యత్వానికి రంఘం సిద్దం… స్పీకర్ పై అనుచిత వ్యక్యలే కారణమా..???