
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉపఎన్నిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించటం అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారగా, ఉప ఎన్నికలపై ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని, తిరిగి తన ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల క్షేత్రంలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో, మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ చాపకింద నీరులా పనిచేసుకుపోతోంది.
Also Read : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి…. వందల ఎకరాల పంట నష్టం
ఇదిలా ఉంటే మునుగోడు ఉపఎన్నికలో కీలకమైన కోమటిరెడ్డి బ్రదర్స్ పై తాజాగా ఓ సంచలన ఆరోపణ మునుగోడు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నేత, తన సోదరుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారని కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొందరు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్దతుగా నిలవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఫోన్ చేశారని ఊకొండి ఎంపీటీసీ సభ్యురాలు భర్త సైదులు గౌడ్ ఆరోపించారు. అంతేకాదు సైదులు గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తనను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారని, అయితే తాను నిరాకరించానని తెలిపారు.
Read Also : ఇలా చేస్తే రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్ జంప్ వంటి ఈవెంట్స్‌లో సక్సెస్ మీదే
ఇలాగే ఆయన పలువురు కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని వారన్నారు. ఇక ఆయన మాత్రమే కాకుండా బుధవారం మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల బృందం సమావేశం నిర్వహించి ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన తమ్ముడు రాజ్‌గోపాల్‌రెడ్డి కోసం ఉప ఎన్నికల్లో పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారని, బీజేపీకి పని చేయాలని కోరుతున్నందున ఆయనపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంకట్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీలో చేరతారని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకులు చేసే విమర్శలను ఆయన ఖండించారు.
Also Read : వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?
ఎవరికీ అలాంటి ఫోన్ కాల్స్ చేయలేదని, కావాలని కొందరు తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు . అవసరమైతే పార్టీకి ప్రచారం చేస్తానని ముందే చెప్పాను. నేను ఎవరినైనా వేరే పార్టీ కోసం పనిచేయాలని ఎందుకు అడుగుతాను, ఎవరైనా కాంగ్రెస్ నాయకులను వేరే పార్టీ కోసం పని చేయమని అడుగుతారా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వెంకట్ రెడ్డి పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? అన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తుంది. ఏదేమైనా మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు తన నిజాయితీని చూపించుకోలేక, ఇక నియోజకవర్గంలో సోదరుడి నిర్ణయంతో బలంగా తిరగలేక, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సఖ్యత లేక, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- సద్ది కట్టుకుని హిందువులు ట్యాంక్ బండ్ రావాలని బండి సంజయ్ పిలుపు
- కోమటిరెడ్డికి షాకుల మీద షాకులు.. బీజేపీ పెద్దలకు మునుగోడు టెన్షన్
- ఈటల సభ్యత్వానికి రంఘం సిద్దం… స్పీకర్ పై అనుచిత వ్యక్యలే కారణమా..???
- తప్పిపోయిన బాలుడిని అప్పగింత
- ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం..