
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలోనే హన్మకొండ పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. హన్మకొండ సీఐ సీహెచ్.శ్రీనివాస్ జీ తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ రాయపురాకు చెందిన నాలుగేళ్ల బాలుడు అర్హాన్ ఇంటి నుంచి తప్పిపోయి గుడిబండల్ ఏరియాలో బుధవారం తిరుగుతుండగా.. స్థానిక యువతి గమనించి బాలుడిని వివరాలు అడగగా ఆ బాలుడు ఏం చెప్పలేకపోయాడన్నారు.
ఇవి కూడా చదవండి..
తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు సీఐ క్రాంతికుమార్ హెచ్చరిక..
ఈ విషయాన్ని గమనించిన యువతి బాలుడుని తీసుకొని హన్మకొండ పీఎస్ కు చేరుకుని సీఐ శ్రీనివాస్ జీకి తెలిపింది. దీంతో సీఐ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు కోటి, కరుణాకర్, వెంకన్నలు ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా అప్పటికే బాలుడి గురించి వెతుకుతున్న బాలుడి మేనమామకి ఈ విషయం తెలిపి వారిని స్థానిక పీఎస్ కు తీసుకువచ్చి పిల్లాడిని అప్పగించినట్లు తెలిపారు. బాలుడిని పీఎస్ కు తీసుకువచ్చిన యువతిని సీఐ శ్రీనివాస్ జీ అభినందించారు. బాలుడి తండ్రి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
One Comment