
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: రౌడీ షీటర్లు పెచ్చుమీరితే తాటతీస్తామని మామునూరు సీఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు. ఎక్కడినుంచైనా రౌడీషీటర్లపై ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు. రౌడీషీటర్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలని.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ఖిలా వరంగల్ మండలంలోని మామునూరు పోలీస్‌స్టేషనలో ఎస్సైలతో కలిసి సీఐ క్రాంతికుమార్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
also read: గురుకులాల సమస్యలు పరిష్కరించు… తరువాత దేశ రాజకీయాలు
ఈ సందర్భంగా సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రౌడీషీటర్‌గా కేసు నమోదై ఉన్నవారు ఎక్కడికి వెళ్లినా, ఇళ్లు మారినా పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా ఏ గొడవలో కూడా తలదూర్చకూడదంటూ పేర్కొన్నారు. రౌడీషీటర్లుగా ఉంటే సమాజంలో చిన్నచూపు చూస్తారని.. గొడవలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచిగా మెలగాలని సూచించారు. గొడవలు, రౌడీయిజం వల్ల కుటుంబానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలు, కుటుంబసభ్యులు ఇబ్బందులు పడకుండా సమాజంలో గౌరవంగా జీవించాలని సీఐ సూచించారు. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అడవుల్లో అలజడి – జల్లెడ పడుతున్న పోలీసులు
పరిగి టీఆర్ఎస్ లో వర్గ పోరు.. ఫోన్ లో పార్టీ నేతను బెదిరిందిన ఎమ్మెల్యే.. వైరల్ గా మారిన ఆడియా
బిగ్ బ్రేకింగ్… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
One Comment