
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా అరెస్టు అయ్యాడు. హైస్కూల్ స్టూడెంట్పై లైంగిక వేధింపుల
ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా ఈతరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి ఒకరు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Also Read : ద్రవిడ్ మేనేజ్మెంట్ వెరీపూర్… పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం
బెలగావిలోని శ్రీ గురు మడివాళేశ్వర మఠం పీఠాధిపతి బసవ సిద్దలింగ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. అయితే అందులో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తన క్వార్టర్స్ లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచరగణం పోలీసులకు వెల్లడించింది. కర్ణాటకలో ఇటీవల లింగాయత్ స్వామిజీ లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే.. ఆ వీడియోలో బసవ సిద్ధ లింగ స్వామి పేరును ఇద్దరు మహిళలు చర్చించుకున్నారు. దీంతో స్వామిజీ ఇది విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
Read Also : కొనసాగుతున్న ఈడి దాడులు… దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు
ఈ క్రమంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు, స్థానికులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో.. రాష్ట్రంలోని కీలకమైన లింగాయత్ సెమినరీలలో ఒకటైన మురుగ మఠానికి అధిపతిగా ఉన్న శివమూర్తి శరణారావును ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కొన్నాళ్లుగా తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస ఘటనలు తీవ్ర కలకలంగా మారాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి :
- గురుకులాల సమస్యలు పరిష్కరించు… తరువాత దేశ రాజకీయాలు
- బ్రిటన్ నూతన ప్రధానిగా లీజ్ ట్రస్….
- 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
- ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్
- ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు