
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సభ్యులు సంతాపం ప్రకటించిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
Read Also : లైంగిక వేదింపుల ఆరోపణలతో శ్రీ గురు మడివాళేశ్వర మఠం పీఠాధిపతి ఆత్మహత్య…
తిరిగి శాసనసభ సోమవారం సమావేశం కానుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిల అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.
Also Read : ద్రవిడ్ మేనేజ్మెంట్ వెరీపూర్… పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం
అదేవిధంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రాత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో పాటు దళితబంధు పథకాన్ని ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా అందచేస్తున్న 100 కుటుంబాలకు అదనంగా మరో 500 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి :
- కొనసాగుతున్న ఈడి దాడులు… దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు
- గురుకులాల సమస్యలు పరిష్కరించు… తరువాత దేశ రాజకీయాలు
- 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
- ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
One Comment