
క్రైమ్ మిర్రర్, నాంపల్లి : తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో సంచలన ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ తగలింది. నాంపల్లి మండలం తుంగపాడు గ్రామంలో బీజేపీ పార్టీ చేరికలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా అక్కడి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా పక్కనే ఉన్న వినాయక మండపం వద్ద రేవంత్ రెడ్డి పాటకు కాంగ్రెస్ కార్యకర్తలు. అధిక సౌండ్ పెట్టడంతో గొడవ జరిగిందని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. సౌండ్ తగ్గించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అంగీకరించకపోవడంతోనే వివాదం జరిగిందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- పరిగి టీఆర్ఎస్ లో వర్గ పోరు.. ఫోన్ లో పార్టీ నేతను బెదిరిందిన ఎమ్మెల్యే.. వైరల్ గా మారిన ఆడియా
- అయ్యప సొసైటీలో ఘనంగా గణేష్ శోభాయాత్ర
- నేడు శ్రీలంకతో భారత్ అమీతుమీ…
- మంగళవారం ప్రారంభం… సోమవారానికి వాయిదా
One Comment