
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : వికారాబాద్ జిల్లా అధికార టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఏ రేంజ్ లో వార్ సాగుతోంది. ఇరు వర్గాల కార్యకర్తలు కొట్టుకునే వరకు పరిస్థితులు వచ్చాయి. తాజాగా పరిగి నియోజకవర్గ గులాబీ పార్టీలో వర్గ పోరు భగ్గుమంది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మైన్ మనోహర్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య గ్యాప్ ఉండగా.. తాజాగా అవి ముదిరి పాకానా పడ్డాయి .మనోహర్ రెడ్డి వెంట తిరుగుతున్నావంటూ ఓ టీఆర్ఎస్ కార్యకర్తను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బెదిరించిన ఫోన్ కాల్ లీకై వైరల్ గా మారింది. జిల్లాలో సంచలనమైంది.
Read More : బిగ్ బ్రేకింగ్… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు మనోహర్ రెడ్డి. తర్వాత ఆయనకు ఉమ్మడి రంగారెడ్డి డిసిసిబి చైర్మైన్ గా నియమించారు. డీసీసీబీ చైర్మెన్ అయినప్పటి నుంచి మహేశ్ రెడ్డితో ఆయన గ్యాప్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న మనోహన్ రెడ్డి కొన్ని రోజులుగా నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో టచ్ లో ఉంటున్నారు మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యేతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇంతకాలం తన సొంత మండలమైన కుల్కచర్లలోనే ఎక్కువ ఫోకస్ చేసిన మనోహర్ రెడ్డి.. తాజాగా మరింత దూకుడు పెంచారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు, దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి సొంత గ్రామంలో హల్చల్ చేశాడు. మనోహర్ రెడ్డికి కిష్టాపురానికి చెందిన కుమార్ సపోర్ట్ చేశారు.
Read More : మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
మనోహర్ రెడ్డి వ్యవహారంతో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అప్రమత్తమయ్యారు. మనోహర్ రెడ్డికి మద్దతుగా ఉంటున్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత కుమార్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే జడ్పీటీసీ తమను వేధిస్తున్నాడని ,అతనితో వేగలేకే తామంతా మనోహర్ రెడ్డి వెంట వెళుతున్నామని చెప్పాడు. అయితే డబ్బులకు లొంగి మీరంతా మనోహర్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్యే ఫైరయ్యారు. పార్టీ టికెట్ తనకేనని మీరేపార్టీ నుండి పోటీ చేస్తారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా.. పార్టీ ఎదైనా మనోహర్ రెడ్డి పోటీ చేయడం ఖాయం గెలవడం ఖాయమని చెప్పారు. పార్టీలో ఏమాత్రం విలువ లేదని, తామ బ్యానర్లు కడితే కూడా చింపివేస్తున్నారని కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. కిష్టాపురం టీఆర్ఎస్ నేత మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వాట్సాప్ గౄపులో హల్చల్ చేస్తోంది. ఎన్నికల సమయానికి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి ….
- అయ్యప సొసైటీలో ఘనంగా గణేష్ శోభాయాత్ర
- లైంగిక వేదింపుల ఆరోపణలతో శ్రీ గురు మడివాళేశ్వర మఠం పీఠాధిపతి ఆత్మహత్య…
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ….
- 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
- ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్
One Comment