
క్రైమ్ మిర్రర్, క్రీడలు : దుబాయ్ వేదికగా శ్రీలంకతో భారత్ తాడోపేడో తేల్చుకోనుంది. అఫ్గానిస్తాన్ పై విజయంతో శ్రీలంక సూపర్ ఫోర్ పాయింట్లపట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ఈమ్యాచ్లో తప్పక నెగాల్సిన పరిస్థితి. పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా విఫలం అయిన రిషబ్ పంత్, యుజువేంద్ర చాహల్ లను పక్కన పెట్టే అవకాశం ఉంది. వీరిస్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ లను బరిలోకి దింపే ఛాన్స్
లేకపోలేదు. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ను కూడా దించవచ్చు.
Read Also : మంగళవారం ప్రారంభం… సోమవారానికి వాయిదా
అశ్విన్ను తీసుకుంటే మాత్రం భారత్ బ్యాటింగ్ లైనప్ లో ఎడమచేతి బ్యాటర్ ఉండడు. దీంతో చాహల్ స్థానంలో అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఓపెనర్లు రాహుల్, రోహిత్లు ఫామ్లోకి రావడం కోహ్లి నిలకడ చూపిస్తుండటం భారత్ కు కలిసొచ్చే అంశాలు. అదే సమయంలో శ్రీలంకను తక్కువగా అంచనావేయడానికి వీలులేదు. టోర్నీని దారుణంగా ప్రారంభించినా జట్టు తర్వాత పుంజుకుంది. టీమ్ లో ఆల్ రౌండర్ లు ఉండటం ఆజట్టుకు కలిసొచ్చే అంశం. 8వ వరుసవరకూ బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అదే ఆజట్టుకు బలం. ఓపెనర్లు నిసంక, కుశాల్ లు ఫామ్లో ఉన్నారు. మిడిలార్డర్ లో అసలంక మాత్రమే పరుగులకోసం ఇబ్బందిపడుతున్నాడు.
Also Read : లైంగిక వేదింపుల ఆరోపణలతో శ్రీ గురు మడివాళేశ్వర మఠం పీఠాధిపతి ఆత్మహత్య…
గుణతిలక, కెప్టెన్ షనక, రాజపక్స ఇలా అందరూ తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచు గెలిపించగలరు. ఆల్రౌండర్లు హసరంగ, కరుణరత్నే ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లలో కీలకంగా ఉంటారు. వీరిప్రధాన సమస్య అనుభవలేమి. భారత్ ఎట్టిపరిస్థితుల్లోను శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. టి20ల్లో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ 25 సార్లు పోటీపడ్డాయి. అందులో భారత్ 17సార్లు గెలిచింది. ఏడుసార్లు శ్రీలంక గెలిస్తే ఒక మ్యాచ్ రద్దయింది. ఇక మంగళవారం జరిగే మ్యాచ్లో టీమిండియాలో రోహిత్ శర్మతో పాటు రాహుల్, కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షరపటేల్/అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రవిబిషోయ్, అర్షదీప్ లు ఉంటారు.
ఇవి కూడా చదవండి :
- ద్రవిడ్ మేనేజ్మెంట్ వెరీపూర్… పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం
- కొనసాగుతున్న ఈడి దాడులు… దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు
- గురుకులాల సమస్యలు పరిష్కరించు… తరువాత దేశ రాజకీయాలు
- 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
- ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్