
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీమిండియా మేనేజ్మెంట్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తంచేసాడు. ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్మెంటుకు జట్టు ఎంపిక కూడా చేతకావడంలేదని అసహనం వ్యక్తంచేసాడు. అసలు భారత్ తుది జట్టులో ఆడే ఆటగాళ్లపై తుదినిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి కాంబినేషన్ను కొనసాగించాలనుకుంటున్నారనే విషయం తెలియజేయాలన్నాడు. జట్టు ఎంపికలో ఇంత గందరగోళం ఏమిటని మండిపడ్డాడు. జట్టు ఎంపికలో రోహిత్ సేన ఇంత గందరగోళానికి ఎందుకు గురవుతున్నదో అర్థం కావడంలేదని షోయబ్ పేర్కొన్నాడు. ముందుగా భారత్ తమ తుది జట్టులోఎవరిని ఆడించాలనుకుంటుందున్న అంశంపై స్పష్టంగా ఉండాలన్నాడు.
Also Read : గురుకులాల సమస్యలు పరిష్కరించు… తరువాత దేశ రాజకీయాలు
భవిష్యత్తు ఆటగాడు ఎవరు రిషిబ్ పంత్, దినేష్ కార్తిక్, దీపక్ హుడా, రవిబిష్ణోయ్లో ఎవరిని కొనసాగించాలనుకుంటున్నారో ముందుగా తుదిజట్టును ఎంపికచేయండి. ఎందుకంటే భారత్ జట్టు ఎంపిక గందరగోళంగా ఉంది. అసలు టీమ్ మేనేజ్మెంట్ ఎందుకింత అయోమయంలో ఉందంటూ ప్రశ్నలు గుప్పించాడు. సూపర్ ఫోర్ మ్యాచ్లో ఓడిన భారత్ ఫైనలు చేరాలంటే శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లతో తప్ప
కుండా గెలవాలి. గెలవడమే కాకుండా మెరుగైన రన్రేట్ సాధించాలన్నది గుర్తుంచుకోవాలని అక్తర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
- బ్రిటన్ నూతన ప్రధానిగా లీజ్ ట్రస్….
- 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
- ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్
- ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు
- బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….