

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బల్లి పడిన కలుషిత ఆహారం తినటం వలన విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో గురుకులాలలో నెలకొంటున్న దారుణమైన పరిస్థితులు పక్కనపెట్టి, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలు చేస్తానని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read : బ్రిటన్ నూతన ప్రధానిగా లీజ్ ట్రస్….
ఆ బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.బల్లి పడ్డ ఆహారం తినడం వల్లనే దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని పేర్కొన్న ఆయన, ఇందులో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. గత రెండు నెలల్లో గురుకులాలలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. గురుకులాల్లో కనీస వసతులు లేకపోవడంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయని, గురుకుల పాటశాలలో కనీస వసతులు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు.
Read Also : 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తానని, బిజెపి ముక్త్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు రాష్ట్రంలో గురుకులాలు పరిస్థితి పై దృష్టి సారించాలని బండి సంజయ్ హితవు పలికారు. సీఎం గారు… దేశ రాజకీయాలు సంగతి తర్వాత చూద్దురు కానీ,ముందుగా గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నా అంటూ బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే బల్లిపడిన భోజనం చేసిన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, వారు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్
- అమిత్ షాతో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి భేటీ….
- ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు
- బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
One Comment