
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : హైదరాబాద్ లో వినాయన నిమజ్జనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వాడవాడలా వెలిసిన బొజ్జ గణపయ్యలు భక్తులతో పూజలందుకుని సాగర తీరాలకు చేరుతున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని యాదవ నిలయం సమీపంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. అత్యంత ఘనంగా నిర్వాహకులు గణనాథుడి శోభాయాత్రను నిర్వహించారు.
Read Also : నేడు శ్రీలంకతో భారత్ అమీతుమీ…
మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లు., బ్యాండ్ బాజాల మధ్య ఘనంగా గణనాథుడిని ఊరేగించారు. ఈ శోభయాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రలో లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయ్యప సొసైటీ నుంచి దుర్గం చెరువు వరకు యాత్ర సాగింది. దారి పొడవునా గణేషుడికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. శోభాయాత్ర ప్రారంభానికి ముందు నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగింది.
Also Read : మంగళవారం ప్రారంభం… సోమవారానికి వాయిదా
విశేష పూజలందుకున్న లడ్డూను సొంతం చేసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. హితేశ్ రెడ్డి వేలం పాటలో లడ్డూను కైవసం చేసుకున్నారు. తర్వాత ఉట్టు కొట్టే కార్యక్రమంగా వైభవంగా సాగింది. చిన్నారులు పోటీ పడి మరీ ఉట్లు కొట్టారు. గణేష్ నిమజ్జన యాత్రలో నిర్వాహకులు నర్సింహ్మ యాదవ్, నగేష్ యాదవ్, నవీన్ యాదవ్, గణేష్ యాదవ్, లింగ స్వామి, శివ, నవీన్ సాంగ్లా, రమేశ్, మహేష్, కాలనీ నాయకులు రోశయ్య, గోపికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురుకులాల సమస్యలు పరిష్కరించు… తరువాత దేశ రాజకీయాలు
- 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
- ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్
- ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు
- బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….