

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 2024 తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. ‘2024 సాధారణ ఎన్నికల తర్వాత ఢిల్లీలో రాబోయేది మన ప్రభుత్వమే’ అని ఆయన అన్నారు. దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలె అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, టీఆర్ఎస్ కార్యాలయాన్నిఆయన ప్రారంభించి అనంతరం గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Read Also : ట్యాంక్ బండ్ కాకపోతే ప్రగతిభవన్ లో నిమజ్జనం చేస్తాం… బండి సంజయ్
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.దేశం కోసం తెలంగాణ గడ్డ నుంచి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 2024 తర్వాత కేంద్రంలో రైతులకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. ‘బావుల దగ్గర మీటర్ పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. మనమంతా ఒక్కటై వానికే మీటర్ పెట్టాలె’ అని కేసీఆర్ అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని వరం భారత్కు ఉంది. మనకు 83 కోట్ల ఎకరాల అనుకూలమైన భూభాగం ఉంది. ఇందులో సగానికి కంటే ఎక్కువ భూమి వ్యవసాయానికి అనుకూలం. బీజేపీ ఇంత జేశాం, అంత జేశాం అని డంబాచారం చెప్పడాలు తప్పితే.. మోదీ వచ్చాక కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిండ్రా? కొత్త ఫ్యాక్టరీ పెట్టిండ్రా? ఉన్నవి అమ్ముకునుడు తప్పితే..! మోదీ పాలనలో దేశంలో.. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, నిరోద్యోగులు, వ్యాపారులు.. ఎవ్వరూ సుఖంగా లేరు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : అమిత్ షాతో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి భేటీ….
నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పేరుతో నరేంద్ర మోదీ తన అనుకూల వ్యాపారులకు దోచిపెట్టిన సంపద 12 లక్షల కోట్లు. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మాత్రం 20.8 శాతం మాత్రమే. దీని విలువ లక్షా 45 వేల కోట్లు మాత్రమే. దోచి పెట్టిన ఆ సంపదతో రైతులకు ఎంత చేయొచ్చో ఆలోచించండి. దేశం మొత్తం రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వవచ్చు అని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ పిడిగిలి బిగించాలని కోరారు. ‘దేశ రాజకీయాల్లోకి పోదామా? ఎంత దాకైనా తెగిద్దామా?’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. త్వరలోనే జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నామని నిజామాబాద్ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన 24 రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు కూడా తనను జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరారని ఆయన తెలిపారు. ‘భారతదేశం బాగుంటేనే మనం కూడా బాగుంటం. మత పిచ్చి, కుంభకోణాలు, విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ పాలన పోవాలి’ అని కేసీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి :
- ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు
- బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?