
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై ఆమె గెలుపొందారు. బోరిస్ జాన్సన్ స్థానంలో ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నెల రోజులకుపైగా సుదీర్ఘంగా సాగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలను సోమవారం వెల్లడించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ట్రస్‌వైపు మొగ్గుచూపారు. సునాక్‌పై ట్రస్ ఏకంగా 20వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురేశారు.
Read Also : 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
పోలైన మొత్తం ఓట్లలో సునాక్‌కు 60,390 రాగా.. ట్రస్‌కు 80వేలపై చిలుక వచ్చాయి. దీంతో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచారు. అంతకు ముందు థెరిసా మే, మార్గరేట్ థాచర్‌లు మాత్రమే బ్రిటన్ ప్రధానులుగా పనిచేశారు. ఫలితాలు ప్రకటించే సమయానికి లిజ్ ట్రస్.. రిషి సునాక్ ఒకేచోట ఉన్నారు. లిజ్ ట్రస్ పేరును ప్రకటించిన వెంటనే రిషి సునాక్ ఆమెను అభినందించారు. బోరిస్ జాన్సన్ కేబినెట్ మంత్రులతో పాటు కన్జర్వేటివ్ పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. లిజ్ ట్రస్‌ను అభినందనలతో ముంచెత్తారు.
Also Read : 2024 తరువాత దేశమంత రైతులకు ఉచిత కరెంట్… నిజామాబాద్ సభలో కేసిఆర్
అనంతరం ఆమె మాట్లాడుతూ తన ప్రాధాన్యతల గురించి వివరించారు. బ్రిటన్ ప్రధానిగా తన ఎన్నిక- చరిత్రలోనే ఓ సుదీర్ఘమైన జాబ్ ఇంటర్వ్యూగా అభివర్ణించారు. ఈ ఇంటర్వ్యూ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంత శక్తిమంతమైనదో దీని ద్వారా మరోసారి తేలిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమయం, టీవీ డిబేట్లల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని లిజ్ ట్రస్ చెప్పారు. వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తానని అన్నారు. పన్నులు తగ్గింపు, ఆర్థిక రంగానికి మరింత ఊతం ఇచ్చే విధానాలను అమలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి సమగ్ర ప్రణాళికలను రూపొందించుకున్నామని, వాటిని అంతే సమర్థవంతంగా అమలు చేస్తానని అన్నారు.
ఇవి కూడా చదవండి :
- అమిత్ షాతో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి భేటీ….
- ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు
- బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?