
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెడీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నాల్గవ దశ ప్రజాసంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12న కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్‌పేటలో ముగుస్తుంది. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేశారు.
Read Also : మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
ఇప్పటికే బండి సంజయ్ మూడు విడతల పాదయాత్ర నిర్వహించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంకోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నాల్గవ విడతలో 10 రోజుల పాటు జరిగే బండి సంజయ్ పాదయాత్రలో 115.3 కిలోమీటర్ల మేర తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తుంది.
Also Read : పంచాయితీ కార్యదర్శిపై నోరు పారేసుకున్న ఎంఎల్‌ఏ గాదరి కిషోర్…
సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ బహిరంగ సభలో పాల్గొనేందుకు బ్రేక్ తీసుకోనున్న బండి సంజయ్, తెలంగాణ విమోచన దినోత్సవం నాడు జరగనున్న సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు సభలో పాల్గొంటారు. పది రోజుల పాటు జరగనున్న నాలుగో విడత పాదయాత్రలో బండి సంజయ్ కుమార్ సేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పర్యటిస్తారని పార్టీ ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
- వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలట!
- షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత మరణం…. ఆత్మహత్య, సహజమరణమా ???
- వ్యభిచారం చేస్తూ హోటల్లో అడ్డంగా బుక్కైన తెలుగు స్టార్ హీరోయిన్..