
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెలిసిందే. వివిధ జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు భారీ బహిరంగ సభలలో పాల్గొంటూ కెసిఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక ఇదే క్రమంలో నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
Read Also : బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….
ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ఎల్లమ్మ గుట్టలోని టిఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. తరువాత గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా పెంచారు.
Also Read : అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతతోరణాలను ఏర్పాటుచేసి నిజామాబాద్ నగరాన్ని ముస్తాబు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయడం కోసం దాదాపు రెండు లక్షల మందితో జనసమీకరణ చేపట్టారు. ఇక నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కేంద్రంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన సాగించి తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ మంత్రులను తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన నేపథ్యంలో నేడు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ నిర్మల సీతారామన్ కు కౌంటర్ ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. నిజామాబాద్ సభా వేదికగా మరోమారు బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తారని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
- పంచాయితీ కార్యదర్శిపై నోరు పారేసుకున్న ఎంఎల్‌ఏ గాదరి కిషోర్…
- వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలట
- ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?