
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్‌కి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మరోసారి వార్ కొనసాగుతోంది. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు మొదలుపెట్టకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల పేరుతో హిందూ సమాజాన్ని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయపోతే వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశం మారుతుందన్నారు.
Read Also : అమిత్ షాతో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి భేటీ….
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం మొదల్కొని అన్నింటిని ప్రగతిభవన్‌కు తీసుకొచ్చి అక్కడే నిమజ్జనం చేయాల్సి వస్తుందని బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్‌కి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మెప్పు కోసం టీఆర్ఎస్ ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాల ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేవలం సుప్రీం కోర్టు ఉత్తర్వుల పేరుతో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనలో టిఆర్‌ఎస్ సర్కారు ఉందని ఆయన ఆరోపించారు.
Also Read : ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు
కేవలం ఒక వర్గం ఓట్ల కోసం యావత్ హిందూ సమాజాన్ని చులకన చేయడం, నిర్లక్ష్యంగా చూడటం మంచి పద్దతి కాదన్నారు బండి సంజయ్. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని తాము ప్రశాంతంగా నిర్వహించాలని చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో అలజడి సృష్టించాలని చూస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి నిమజ్జనం ఏర్పాట్లు చేయడం చేతకాకపోతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు బీజేపీ చీఫ్. ఏర్పాట్లు చేయకపోయినా నిమజ్జనం చేసి తీరుతామన్నారాయన. ఒకవేళ శాంతిభద్రతల పేరుతో ఏదైనా ఆందోళన సృష్టించాలని చూస్తే విగ్రహాలు నిమజ్జనం చేసే ప్లేసు మారుతుందన్నారు. ట్యాంక్‌బండ్‌లో కాకుండా ప్రగతి భవన్‌లో నిమజ్జనం చేస్తామని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
- ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం