
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సోమవారం నాడు సమావేశమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, నితిన్ తరువాత ఇక అమిత్ షా బాలీవుడ్‌పై తన దృష్టిని కేంద్రీకరించినట్టయింది. రోహిత్ షెట్టి ఈ ఉదయం ముంబైలో అమిత్ షాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయాల గురించి వారిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ముగ్గురు మహిళలపై నిఘా… తెలుగు రాష్ట్రాలలో NIA సోదాలు
భారతీయ జనతా పార్టీ కొత్త తరహా రాజకీయాలను మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీని తన చేతుల్లోకి తీసుకునే దిశగా ప్రయత్నాలకు తెర తీసినట్టే. మొన్నటికి మొన్న టాలీవుడ్ టాప్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత నితిన్‌తో బీజేపీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఉప ఎన్నికను ఎదుర్కొనబోతోన్న నల్లగొండ జిల్లా మునుగోడు పర్యటనకు వచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్‌ను తన వద్దకు పిలిపించుకొని, సుదీర్ఘంగా చర్చించారు.
Read Also : నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు కేసిఆర్…
ఆ తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలను తాము వినియోగించుకుంటామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. దీనితో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏపీ బీజేపీకి ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తారనే ప్రచారానికి సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెర తీసినట్టయింది. అమిత్ షాతో భేటీ తరువాత వచ్చిన ఏ వార్తలపై గానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. రాజకీయ రంగప్రవేశంపై గానీ, టీడీపీని తన చేతుల్లోకి తీసుకుంటారనే వార్తలను తోసిపుచ్చలేదు.. అలాగని సమర్థించనూ లేదు. టాలీవుడ్ నుంచి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ నుంచి టాప్ దర్శకుడు రోహిత్ షెట్టిలను అమిత్ షా ఉద్దేశపూరకంగా సమావేశం కావడం కొత్త ఈక్వేషన్లకు కేంద్రబిందువయింది.
Also Read : బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….
పాన్ ఇండియా గుర్తింపు ఉన్న హీరో-దర్శకుడిని అమిత్ షా లైన్‌లో పెట్టడానికి కారణాలు లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులను ఈ ఇద్దరితో తెరకెక్కించేలా బీజేపీ ప్లాన్ వేసిందని చెబుతున్నారు. రోహిత్ షెట్టికి సూపర్ హిట్ సినిమాల దర్శకుడిగా పేరుంది. షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్, అక్షయ్ కుమార్‌తో సూర్యవంశ్, అజయ్ దేవ్‌గణ్‌తో సింగం, రణ్‌వీర్ సింగ్‌తో సింబా వంటి పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ హీరోగా సర్కస్ అనే మూవీని చిత్రీకరిస్తోన్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఇందులో రణ్‌వీర్ సింగ్‌ది డ్యూయెల్ రోల్. పూజా హెగ్డె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
- పంచాయితీ కార్యదర్శిపై నోరు పారేసుకున్న ఎంఎల్‌ఏ గాదరి కిషోర్…
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
- వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలట!