
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మరణించారు. తెలంగాణలో సంచలనం రేపిన బంజారాహిల్స్ భూ వ్యవహారంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో ఏసీబీ అధికారులు అప్పట్లో ఈమెను అరెస్ట్ చేశారు. ఈ కేసు వ్యవహారంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సుజాత భర్త అజయ్ కూడా ఆత్మహత్య చేసుకునే మరణించారు.
Read Also : నేడు మునుగోడుకు రేవంత్ రెడ్డి… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాకపై సదేహం…
అరెస్ట్, ఆ తర్వాత భర్త మరణం వీటన్నింటి కారణంగా రెండేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకు గురైన సుజాత ఇవాళ హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందినట్లు సమాచారం. తొలుత ఆమెది ఆత్మహత్యగా చెప్పినా.. ఆ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు. దాంతో పోలీసులు ఆమె మృతిని అనుమానాస్పదంగా చూస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 2020 జూన్‌లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూవివాదం కేసులో అరెస్ట్ అయిన పది రోజులకే ఐదు అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకి సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవి కూడా చదవండి :
- నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ వరస సమావేశాలు… కీలక ప్రకటన ప్రకటించే అవకాశం..!!!
- ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
- విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
- కుమారుడి జ్ఞాపకార్ధం ఉచిత పెట్రోల్ పంపిణీ… భారులు తీరిన వాహనదారులు
- అత్తింటి వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య…
2 Comments