
క్రైమ్ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో బోర్ల దందా యథేచ్ఛగా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా కొనసాగుతుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అక్రమ బోర్లు ఇష్టానుసారంగా సాగుతున్నాయి. తదితర ప్రాంతాల్లో అక్రమ బోర్లు జోరుగా వెలుస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా అక్రమ బోర్లు వేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
Read Also : షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత మరణం…. ఆత్మహత్య, సహజమరణమా ???
ఇప్పటికే శేరిలింగంపల్లి పరిధిలో నీటి ఎద్దడి ఎంతో ఉందంటూ, కనీస అవసరాలకు కూడా నీరు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇట్టి విషయాన్ని కాలనీల వాసులు అధికారులకు తెలుపుతున్నప్పటికీ వారు నిర్లక్షంగా వ్యవహరి స్తుండడం వల్ల అక్రమ బోర్లు యథేచ్ఛగా సాగుతు న్నాయి. వ్యవసా యానికి మాత్రమే అనుమతులు ఉన్నా ఆరున్నర అంగుళాల బోర్లను నివాస స్థలాల్లో ఇష్టానుసారంగా వేసుకోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు పలుమార్లు సమాచారం అందించినప్పటకి ఎటువంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నేడు మునుగోడుకు రేవంత్ రెడ్డి… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాకపై సదేహం…
నగరంలో ఊపు అందుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, దళారులకు బోర్ల దందా కనకవర్షం కురిపిస్తుంది. నూతన నిర్మాణాలు చేపట్టాలంటే మొదట బోర్ల యజమానులను, దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే ఎన్నో చోట్ల చోటు చేసుకుంటున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వెక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వారి వృత్తిని సక్రమంగా నిర్వర్తించాలంటు కాలనీ వాసులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ వరస సమావేశాలు… కీలక ప్రకటన ప్రకటించే అవకాశం..!!!
- ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
- విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
- కుమారుడి జ్ఞాపకార్ధం ఉచిత పెట్రోల్ పంపిణీ… భారులు తీరిన వాహనదారులు
- మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
One Comment