
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ లోని రెండు వేర్వేరు హోటళ్లలో వ్యభిచారం జరుగుతోందని స్పష్టమైన సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయా హోటల్స్ పై దాడి చేసి ఇద్దరు హీరోయిన్స్ని అరెస్ట్ చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో హోటల్ పై దాడులు జరిపిన సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
Read Also : ప్రతి వైన్ షాప్ లో కేసిఆర్ ఫోటో పెట్టాలి… రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్
హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ముంబైకి చెందిన రిచా అనే నటిని, ఆమెతోపాటు ఆమెకి, విటులకి మధ్య బ్రోకర్గా పనిచేస్తోన్న మోనిష్ కడాకియాను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకి అప్పగించారు. ఇదే కాకుండా తాజ్ బంజారా హోటల్లోనూ వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో హోటల్ పై దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..
Also Read : షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత మరణం…. ఆత్మహత్య, సహజమరణమా ???
రూమ్ నెంబర్ 402 నుంచి బెంగాలీ టీవీ నటి సుబ్ర చటర్జీ, విటుడు వెంకటేశ్వర రావుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకి సంబంధించిన బ్రోకర్ జనార్థన్ పరారీలో వున్నట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం కేసు ప్రాథమిక దర్యాప్తులో వుందని, కేసు విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించడం జరుగుతుందని పంజాగుట్ట సీఐ రవీందర్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- నేడు మునుగోడుకు రేవంత్ రెడ్డి… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాకపై సదేహం…
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యధేచ్చగా కొనసాగుతున్న అక్రమ బోర్లు….
- నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ వరస సమావేశాలు… కీలక ప్రకటన ప్రకటించే అవకాశం..!!!
- ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
- విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
One Comment