
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు పథకాలపై ఇరు పార్టీల నేతల మధ్య ఆరోపణలు సాగుతుండగా.. తాజాగా ఫోటో, ఫ్లెక్సీ రచ్చ సాగుతోంది. తెలంగాణలో వరుసగా పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు కేంద్ర పథకాలను సంబంధించిన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకుంటుందని ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపు దగ్గర ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోవడంపై ఆమె అధికారులపై ఆగ్రహం చేశారు. జనాల ముందే జిల్లా కలెక్టర్ కు క్లాస్ పీకారు నిర్మలా సీతారామన్.
Read More : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యధేచ్చగా కొనసాగుతున్న అక్రమ బోర్లు….
శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. తెలంగాణలో జారీ చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోవడంపై కేంద్ర మంత్రి తప్పుపట్టారు. అన్ని రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఫోటోను ముద్రిస్తున్నారని తెలంగాణలో అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బ్యానర్ లో కేసీఆర్, హరీష్ రావు ఫోటోలు ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోటోలకు సంబంధించి తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఆయన పవర్ ఫుల్ సెటైర్లు వేశారు. ప్రతి రేషన్ షాపులో ప్రధాని ఫోటో పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు.. ఎందుకంటే ప్రధాని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం ప్రతి వైన్ షాపులో కేసీఆర్ ఫోటో పెట్టాలి.. మందు బాటిళ్ల పైన పింక్ లేబుల్ వేయాలి అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీలో కూడా ప్రతి వైన్ షాపులో లిక్కర్ క్వీన్ కవిత ఫోటో పెట్టాలి అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
- పంచాయితీ కార్యదర్శిపై నోరు పారేసుకున్న ఎంఎల్‌ఏ గాదరి కిషోర్…
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
- వ్యభిచారం చేస్తూ హోటల్లో అడ్డంగా బుక్కైన తెలుగు స్టార్ హీరోయిన్..