
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి తాజా సర్వే ఫలితాలను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇందులో సంచలన ఫలితం వచ్చింది. ప్రగతి భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సర్వే ఫలితాలు ప్రకటించడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు, ఈ దఫా కూడా సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామన్న కేసీఆర్… ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
Read More : షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత మరణం…. ఆత్మహత్య, సహజమరణమా ???
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కే విజయావకాశాలు ఉన్నాయన్నారు కేసీఆర్. టీఆర్ఎస్ కు 72 నుంచి 80 సీట్లు వస్తాయన్నారు. కొంత కష్టపడితే 90 సీట్లు ఖాయమన్నారు. సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు కేసీఆర్. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికను కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ కు 41 శాతం ఓట్లు వస్తాయన్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందన్న కేసీఆర్.. బీజేపీకి మునుగోడులో అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అసలు పోటీలోనే లేదని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి రెండు గ్రామాలకు ఓ ఎమ్మెల్యేను ఇంచార్జీగా నియమించనున్నట్లు కేసీఆర్ చెప్పారు.
Read More : నేడు మునుగోడుకు రేవంత్ రెడ్డి… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాకపై సదేహం…
ఇక అంతకుముందు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గ సహచరులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మనపై పడబోతోందని చెప్పిన కేసీఆర్… ఎలాంటి తప్పులకు అవకాశాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును గుర్తు చేసిన కేసీఆర్… నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మనపై పడతాయని, ఆ సంస్థలకు అవకాశం ఇచ్చే పనులు చేయరాదని హితబోధ చేశారు.
Read More : ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
బీజేపీ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులకైనా అందరూ సిద్ధంగానే ఉండాలని కేసీఆర్ సూచించారు. సీబీఐ విచారణల విషయంలో రాష్ట్రాల అనుమతి తప్పనిసరి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల దండయాత్ర మొదలైందని, భవిష్యత్తులో మరింత మేర పెరుగుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రులు అలసత్వంగా ఉండొద్దని కేసీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి ..
- పంచాయితీ కార్యదర్శిపై నోరు పారేసుకున్న ఎంఎల్‌ఏ గాదరి కిషోర్…
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
- వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలట!
- వ్యభిచారం చేస్తూ హోటల్లో అడ్డంగా బుక్కైన తెలుగు స్టార్ హీరోయిన్..
2 Comments