
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : అందరి పిల్లల్లాగే ఆ ఇద్దరూ పిల్లలు బాల్యంలో ఆటలాడుకున్నారు. వారి ఆటలు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. వారు ఎదిగే కొద్దీ విధి వక్రీకరించింది. పదవ తరగతిలో ఒకరు, ఏడవ తరగతిలో మరోకరు కండరాల క్షీణతతో నడవలేని పరిస్థితికి రావడంతో ఆతల్లిదండ్రులు నిత్యం నరకయాతన పడుతున్నారు. ముఖ్యమంత్రి సారు మమ్మల్ని ఆదరించి ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆ తల్లిదండ్రుల కన్నీరు ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నామాపురం గ్రామంలో వెలుగు చూసింది. నామాపురం గ్రామానికి చెందిన మహేశ్వరం వెంకటాచారి అనురాధ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. ప్రస్తుతం శశాంక్ కు(25 )తేజకు( 22) సంవత్సరాలు ఉన్నాయి. పుట్టినప్పుడు వారిని చూసి ఆ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేవు. శశాంకు పదో తరగతి వరకు అందరి పిల్లలు లాగే అతను పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత కండరాల క్షీణతతో నడకలో ఇబ్బందులు పడ్డాడు. అలాగే తేజ కూడా ఏడవ తరగతి వరకు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాడు. కానీ ఆ తర్వాత అతను కూడా నడవలేక ఇంటికే పరిమితం అయ్యాడు. 25 సంవత్సరాల కు వయోజనులైనప్పటికీ తల్లిదండ్రుల సహాయం లేనిదే ఆ ఇద్దరు పిల్లలు కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి నెలకొంది. నాటి నుండి నేటి వరకు సుమారు 25 లక్షలు ఖర్చు చేసి ఎన్ని ఆసుపత్రులు తిరిగిన ప్రయోజనం లేదు. సొంత ఇంటిని కూడా అమ్ముకొని పిల్లల కోసం వైద్యం చేయించిన ఆ తల్లిదండ్రుల కల మాత్రం సాకారం కాలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అవుతది అనుకుంటే నేటి వరకు ఆ ఇద్దరికీ ఆసరా పెన్షన్ కూడా మంజూరీ చేయలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు రోదన అరణ్య రోదనే అయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని, ఆ ఇద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ మంజూరు మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read Also : విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
కండరాల క్షీణతతో నడవలేని పరిస్థితి
మహేశ్వరం వెంకటాచారి అనురాధ దంపతులకు జన్మించిన శశాంకు, తేజలు కండరాల క్షీణతతో మంచానికి పరిమితమై విలవిలలాడుతున్నారు. పెద్ద కుమారునికి 25 సంవత్సరాలు చిన్న కుమారునికి 22 సంవత్సరాలు వచ్చినప్పటికీ అన్నం తినాలన్నా కాల కృత్యాలు తీసుకోవాలన్న తల్లిదండ్రుల సహాయం లేనిదే కదలలేని పరిస్థితి. శుభకార్యాలకు ఎక్కడికి వెళ్లాలన్నా తల్లి అయినా తండ్రి అయినా ఇంట్లో ఉండాల్సిందే. దీంతో తల్లిదండ్రులు గత 15 ఏళ్ల నుండి ఆ పిల్లల బాగోగులు చూసుకోలేక బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లలేక నిత్యం మదన పడుతూనే ఉన్నారు.
Also Read : కుమారుడి జ్ఞాపకార్ధం ఉచిత పెట్రోల్ పంపిణీ… భారులు తీరిన వాహనదారులు
వైద్యం కోసం సొంతింటిని సైతం అమ్మారు
అందరి పిల్లలు లాగానే తన పిల్లలు పెద్దవారై తమకు వృద్ధాప్యంలో ఆసరా అవుతారని హైదరాబాదులో ఉన్న తన సొంత ఇంటిని విక్రయించి ఆ పిల్లలకు హైదరాబాదు, ముంబై, బెంగళూరు ఆసుపత్రులలో వైద్యం చేయించారు. ఇప్పటివరకు అలోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం వైద్యం కోసం రూ 25 లక్షల పైనే ఖర్చు చేసిన ప్రయోజనం లేదు.
Read Also : కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర ఆర్దిక మంత్రి సీతారామన్ ఫైర్…. అరగంట టైమ్
నేటి వరకు వారికి పెన్షన్ అందని ద్రాక్షే
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు మంజూరు చేసే ఆసరా పెన్షన్ కు శశాంకు తేజలు ఏడు సంవత్సరాల క్రితం సదరన్ సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు వారికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయలేదు. పెన్షన్ కొరకు నల్గొండ, మర్రిగూడ మండల పరిషత్ కార్యాలయం చుట్టూ ఆ పిల్లల తండ్రి చెప్పులరిగేలా తిరుగుతున్న ప్రభుత్వం నేటి వరకు పెన్షన్ మంజూరు చేయలేదు. బై ఎలక్షన్ పుణ్యమా అని ఇప్పుడైనా వస్తుందేమోనని ఆశించిన వారికి పెన్షన్ మాత్రం మంజూరు కాలేదు.
ఇవి కూడా చదవండి :
- ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
- వైఎస్సార్ జిల్లాలో జగన్ రెండవ రోజు కొనసాగిన పర్యటన… తండ్రికి ఘననివాళి
- కేసిఆర్ పర్యటనకు ముందు ఇందూరులో బిజేపి భహిరంగసభ…
- దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
- అత్తింటి వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య…