
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. పంచాయతీ కార్యదర్శిపై నోరు పారేసుకున్నారు. ఒక ప్రభుత్వ అధికారిపై అలాంటి కామెంట్స్ చేయడంతో అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో శనివారం ఫించన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారిపై నోరు పారేసుకున్నారు.
Read Also : వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలట!
దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన పేదలందరికి ఆసరా పింఛన్ల పంపిణీ, సిసి రోడ్ల నిర్మాణ శంకుస్థాపన ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి ఎవరని ఆయన ప్రశ్నించగ అక్కడనే ఉన్న కార్యదర్శి లేచి నిలబడగ ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి కాకుండా మరెవరికి ఫించన్లు ఇచ్చినా బాగోదు “నీ లాగు పగులుద్దీ” అంటూ పరుషపదజాలం వాడారు. దీంతో ఆ సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఓ ప్రభుత్వ అధికారిపై ఇలాంటి భాష వాడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యధేచ్చగా కొనసాగుతున్న అక్రమ బోర్లు….
- షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత మరణం…. ఆత్మహత్య, సహజమరణమా ???
- నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ వరస సమావేశాలు… కీలక ప్రకటన ప్రకటించే అవకాశం..!!!
- ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
- విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం