
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ఆయన వరుసగా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారు. కేబినెట్ భేటీతో పాటుగా పార్టీ సమావేశం ఒకే రోజు ఏర్పాటు చేయటం ద్వారా ముఖ్యమంత్రి ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా టీఆర్ఎస్ ఇక నుంచి జాతీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో కీలక అడుగులు వేయనున్నట్లు టిఆర్‌ఎస్ వర్గాలలో చర్చ మొదలైంది.
Read Also : ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
ఈరోజు మధ్నాహ్నం రెండు గంటలకు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఆ సమావేశంలో రాష్ట్రంలో విచారించేందుకు వీలుగా సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతులు ఉపసంహరించుకోవడం కేబినెట్ ఎజెండాలో ఉండనుందని అధికార వర్గాల సమాచారం. ఉద్యో గ నోటిఫికేషన్ల జారీ లో పురోగతి, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, ధరణి సమస్యలు, వాయిదా పడిన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, విద్యుత్ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఆదేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
Also Read : విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం జరగనుంది. ఈ వరుస సమావేశాల నేపథ్యంలో అనేక అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. టీఆర్‌ఎస్ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీల భేటీకి హాజరు కావాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటు కు సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని పార్టీ ముఖ్య నేతల అంచన వేస్తున్నారు. 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేసిన నేపథ్యంలో, నియోజకవర్గాల్లో అర్హులందరికీ చేరేలా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఓటు బ్యాంకులో కీలకమైన ఆసరా పింఛన్ లబ్ధి దారుల అభిమానం చూరగొనేలా క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేయాల్సిందిగా ఆదేశించనున్నారు.
Read Also : కుమారుడి జ్ఞాపకార్ధం ఉచిత పెట్రోల్ పంపిణీ… భారులు తీరిన వాహనదారులు
కేంద్రం పైన ఇక దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17నుంచి రాష్ట్రంలో తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అటు బీజేపీ..విమోచన దినోత్సవం నిర్వహణకు సిద్దం అవుతున్న వేళ.. ముఖ్యమంత్రి నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది. అదే విధంగా తెలంగాణలో సీబీఐకి రాష్ట్రంలో విచారణకు అవకాశం లేకుండా చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి భేటీ ఈ నెల 6న ప్రారంభం కానున్నాయి. ఇక, బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకె విమోచన దినోత్సవం పైన కీలక నిర్ణయం తీసుకెంది. దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై వచ్చే 17వ తేదీకి 74 ఏళ్లు గడిచి 75వ ఏట ప్రవేశిస్తున్న తరుణంలో ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు చాటేలా కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్ భేటీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేసే అవకాశముంది. ఇటు పాలనా పరంగా.. రాజకీయంగా ఈ రోజు జరిగే కీలక సమావేశాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.
ఇవి కూడా చదవండి :
అత్తింటి వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య…
వైఎస్సార్ జిల్లాలో జగన్ రెండవ రోజు కొనసాగిన పర్యటన… తండ్రికి ఘననివాళి
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
కేసిఆర్ పర్యటనకు ముందు ఇందూరులో బిజేపి భహిరంగసభ…
మీడియా రంగంలోకి అదానీ గ్రూప్.. NDTVని దక్కించుకునేందుకు భారీ డీల్