
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు మునుగోడులో పర్యటించారు. టీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్ విడుదల చేశారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు. బీజేపీ ఇచ్చిన 22 వేల కోట్ల కాంట్రాక్టులకు కక్కుర్తి పడి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. కమలం పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.
Read More : మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
టీఆర్ఎస్, బీజేపీపై జానారెడ్డి ఛార్జ్ షీట్ విడుదల చేశారంటే ఆ పార్టీలకు కష్టాలు తప్పవన్నారు రేవంత్ రెడ్డి. నల్లగొండ జిల్లా ఉద్యమానికి పెట్టింది పేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి140 ఏళ్ళ చరిత్ర ఉందన్న రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. చెప్పుకోవడానికి చరిత్ర లేనివాళ్లు ప్రస్తుతం మతం పేరుతో తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఓట్ల కోసం విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధుల కొనుగోళ్లు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులో నేతల అమ్మకాలు తప్ప అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన నేతలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని అన్నారు. అమ్ముడుపోయిన నేతలను చీపుర్లతో చితకొట్టాలని మహిళలకు ఆయన పిలుపిచ్చారు.
ఇవి కూడా చదవండి …
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
- వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలట!
- వ్యభిచారం చేస్తూ హోటల్లో అడ్డంగా బుక్కైన తెలుగు స్టార్ హీరోయిన్..
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యధేచ్చగా కొనసాగుతున్న అక్రమ బోర్లు….