
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సెప్టెంబర్ 17 సెగలు రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిపాటు ఉత్సవాలు జరపనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఉత్సవాల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను సైతం రావాలని ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ప్రాంతం ఇండియాలో కలుస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటకలోకి వెళ్లాయని గుర్తు చేశారు. అందుకే వారిని ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని..పవర్‌లోకి రాగానే విస్మరించారని బీజేపీ మండిపడుతోంది.
Read More : విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
సెప్టెంబర్ 17పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అదే రోజు హైదరాబాద్ పాతబస్తీలో తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం..భారత్‌లో విలీనం అయ్యిందని గుర్తు చేశారు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని.. అలాకాకుండా జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇందులోభాగంగానే కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్‌కు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని తెలిపారు. తురేబాజ్‌ఖాణ్ వీరోచిత పోరాటం చేశారని స్పష్టం చేశారు.
Read More : కుమారుడి జ్ఞాపకార్ధం ఉచిత పెట్రోల్ పంపిణీ… భారులు తీరిన వాహనదారులు
పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామ్నారు అసదుద్దీన్ ఓవైసీ. అనంతరం ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని..పార్టీ ఎమ్మెల్యేలంతా ఇందులో పాల్గొంటారని తెలిపారు. మొత్తంగా సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర చేపట్టడం, బహిరంగ సభకు ప్లాన్ చేయడం హైదరాబాద్ లో టెన్షన్ పుట్టిస్తోంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి …
- షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత మరణం…. ఆత్మహత్య, సహజమరణమా ???
- మునుగోడుకు రేవంత్ రెడ్డి… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాకపై సదేహం…
- ముఖ్యమంత్రి కేసిఆర్ వరస సమావేశాలు… కీలక ప్రకటన ప్రకటించే అవకాశం..
- ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
- వైఎస్సార్ జిల్లాలో జగన్ రెండవ రోజు కొనసాగిన పర్యటన… తండ్రికి ఘననివాళి
One Comment