
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : బుడిబుడి నడక నేర్పడానికి ముద్దు మురిపంతో నాయనమ్మ ఎదలపై తన్నించుకొని సంతోషపడితే..యుక్త వయసైన మనవడు అదే నాయనమ్మకు చేయూతనియ్యకపోగా. పెన్షన్ సొమ్ము కోసం పబ్లిక్ గా తన్నుతు చిత్రవధ చేసిన మనవడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తలదించుకునే సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో జరిగింది.వివరాల్లోకి వెళితే మంబాపూర్ గ్రామానికి చెందిన యశోదమ్మకు ప్రభుత్వం వృద్ధప్య పెన్షన్ అందజేసింది.
Read Also : కుమారుడి జ్ఞాపకార్ధం ఉచిత పెట్రోల్ పంపిణీ… భారులు తీరిన వాహనదారులు
తాగుడుకు (మద్యానికి) బానిస అయిన పంచాయతీ కార్మికుడు సొంత మనవడు గోవర్ధన్ ప్రతినెల ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ సొమ్ము యశోదమ్మను బెదిరించి జల్సా చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈనెల వచ్చిన పెన్షన్ సొమ్ము తీసుకొని జల్సా చేశాడు.కొన్ని ఖర్చుల కోసం దాచుకున్న పెన్షన్ డబ్బులు ఇవ్వాలని నాయనమ్మ యశోదమ్మను పబ్లిక్ గా కాళ్లతో తనుతు కర్రతో కొడుతూ చిత్రవధ చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు.నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.ఈ మేరకు తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ విచారణ జరిపారు.
Also Read : కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర ఆర్దిక మంత్రి సీతారామన్ ఫైర్…. అరగంట టైమ్
నిందితుడు యశోదమ్మ మనవడు గోవర్ధన్ పై పెద్దముల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.గత మూడు రోజుల క్రితం ఈ సంఘటన జరిగిందని జనం ప్రేక్షక పాత్ర పోషించడం బాధాకరమైన విషయమని ఆయన వెల్లడించారు. గ్రామంలో ఈ సంఘటన జరిగిన ఈ విషయమై ఎవ్వరు పోలీసులకు సమాచారం అందించలేదని అన్నారు.నిందితుడు పరారీలో ఉన్నాడని వెంటనే పట్టుకుని రిమాండ్ కు తరలిస్తామని ఆయన తెలియజేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు.కాగా యశోదమ్మ కొడుకు కోడలు వివిధ కారణాల చేత మృతిచెందారు.వారికి నలుగురు సంతానం వారిలో ఒక మనవడు మృతి చెందగా ఇద్దరు మనవరాలు ఒక మనవరాలు ఉంది.ఇటీవల మనవరాలు పెళ్లి జరిగింది.
Read Also : ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
అయితే ఇద్దరు మనుమళ్ల దగ్గర ఉంటూ ఉద్యోగం ఉపాధి గడుపుతుంది. ఇద్దరు మనుమల్లు మంబాపూర్ గ్రామపంచాయతీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి దగ్గర ఉంటూ యశోదమ్మ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సొమ్ముతో జీవనోపాధి గడుపుతుంది.అదే సొమ్ము కోసం పెద్ద మనవడు గోవర్ధన్ ప్రతినెల నాయనమ్మని బెదిరించి పెన్షన్స్ సొమ్ము తీసుకొని జల్సాలకు అలవాటు పడ్డాడు. సొమ్ము ఇవ్వకపోతే తరచు నాయనమ్మపై బూతులు తిడుతూ కొట్టే వారని గ్రామస్తులు తెలియజేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర నిరసన వ్యక్తం అవుతుంది నిందితున్ని కఠినంగా శిక్షించాలని పోలీసులపై ప్రసారం మాధ్యమాల్లో ప్రజలు ఒత్తిడి తెస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- అత్తింటి వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య…
- కేసిఆర్ పర్యటనకు ముందు ఇందూరులో బిజేపి భహిరంగసభ…
- తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన….
- మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
- దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
One Comment