
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందించిన సహకారాన్ని తెలియజేయడం కోసం, తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టడం కోసం బిజెపి ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’లో భాగంగా కేంద్ర మంత్రులను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన పర్యటన శుక్రవారం నాడు కొనసాగించనున్నారు.
Read Also : మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
నేడు బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించనున్నారు. బిక్నూర్ లో రేషన్ షాప్ ను సందర్శించి, అనంతరం కోటగిరి పీహెచ్సీలో వ్యాక్సినేషన్ సెంటర్ ను నిర్మల సీతారామన్ సందర్శిస్తారు. ఇక ఇప్పటికే తొలిరోజు పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్ దేశ రాజకీయాలు తర్వాత ముందు రాష్ట్రంపై ఫోకస్ చేయాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అలాగే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్ లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏవిధంగా మార్చారో నిర్మల సీతారామన్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.
Also Read : దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే పుట్టిన బిడ్డ మీద కూడా లక్ష రూపాయల అప్పు ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని నిర్మల సీతారామన్ తెలంగాణ ప్రజలకు తెలియజేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి వరదలై పారిందని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఇక తాజాగా రెండో రోజు పర్యటన సందర్భంగా నిర్మల సీతారామన్ తెలంగాణ ప్రభుత్వాన్ని మరింతగా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘ప్రవాస్ యోజన’లో భాగంగా ఆగస్టు 29, 30 తేదీల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి (సహకార) బీఎల్ వర్మ పర్యటించారు.
Read Also : అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు- ఎస్ఐ సైదా బాబా.
హైదరాబాద్ పార్లమెంటుకు జ్యోతిరాదిత్య సింధియా బిజెపి ఇన్చార్జిగా వ్యవహరించి ఆయన పర్యటన చేశారు. అప్పుడు కూడా ఆయన తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల్లోనూ పర్యటనలు చెయ్యాలని, క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను, కేంద్రం అందిస్తున్న సంక్షేమాన్ని తీసుకువెళ్లాలని, ఇదే సమయంలో తెలంగాణ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనను టార్గెట్ చేయాలని భావిస్తున్న క్రమంలోనే రాష్ట్రానికి కేంద్ర మంత్రుల రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి :
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ….
- మునుగోడులో టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించిన సిపిఎం….
- మునుగోడులో బిజేపి పార్టీ మరో భహిరంగసభ…
- టిఆర్‌ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడాలి… మునుగోడులో మావోల లేఖ కలకలం
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???