
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సెప్టెంబర్ 5న నిజామాబాదులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీ కంటే రెండు రోజుల ముందుగా సెప్టెంబర్ 3న జరిగే బహిరంగ సభలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిని ఉతికి ఆరేస్తానని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Also Read : తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన….
ఈ క్రమంలో కేసీఆర్ పర్యటనకు ముందే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ ఇందూరు జనతా కో జవాబ్ దో అనే నినాదంతో భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హామీల అమలు పై సీఎం కేసీఆర్ కు ధర్మపురి అరవింద్ బహిరంగ లేఖ రాశారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి తనకు ఆహ్వానం అందలేదని పేర్కొన్న ఆయన, సీఎం నిర్వహించే సభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను టిఆర్ఎస్ పార్టీ ఒకటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
Read Also : మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
2014, 2018 టీఆర్‌ఎస్ మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను, నెరవేర్చని వాగ్దానాలపై దృష్టి సారిస్తానని, కెసిఆర్ ‘తప్పిదాలు, కమీషన్‌లను’ బయటపెడతానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పట్టణంలోని బీఎల్‌ఎన్ గార్డెన్స్‌లో ఇందూరు జనతా కో జవాబ్ దే పేరుతో బహిరంగ సభ నిర్వహించి మరీ కేసీఆర్ ను టార్గెట్ చేయనున్నారు. అధికారిక సమీక్ష మరియు బహిరంగ సభకు తనకు సరైన ఆహ్వానం అందాలి. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం అందకపోతే సీఎం కార్యక్రమాలకు హాజరు కానని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి అవగాహన కల్పిస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై ఆయన మరో లేఖ విడుదల చేశారు.
Read Also : దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి లేఖ, నివేదిక కాపీలను పంపిస్తామన్నారు. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే చర్యలేవీ చేపట్టలేదని మండిపడ్డారు. తన బహిరంగ లేఖలో లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుకడుగు వేస్తున్న విషయంపై వివరణ ఇవ్వాలన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం తప్ప మరొకటి కాదన్నారు. రానున్న మూడు నెలల్లో టీఆర్‌ఎస్‌ను బీజేపీ దుర్భర దశకు తీసుకు వెళ్లడం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
Also Read : అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు- ఎస్ఐ సైదా బాబా.
సుమారు రెండున్నరేళ్ల క్రితం రైల్వే మంత్రిత్వ శాఖ మాధవనగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని మంజూరు చేసిందని, అంచనా పెట్టుబడిలో వాటాగా రూ.30 కోట్లు విడుదల చేసిందని అరవింద్ తెలిపారు. కానీ నేటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా పనులు ప్రారంభించలేదని అసహనం వ్యక్తం చేశారు. దళిత, గిరి జనుల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను విస్మరించారని, కనీసం కేసులు కూడా ఎత్తి వేయలేదని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. బీహార్ వెళ్లిన సీఎం కెసిఆర్ తెలంగాణ పరువు తీశారని ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకోసారి కేసీఆర్ ను బీహార్ రానివ్వకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మూడు నెలల తరువాత టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ…..
- మునుగోడులో టిఆర్‌ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించిన సిపిఎం….
- మునుగోడులో బిజేపి పార్టీ మరో భహిరంగసభ…
- గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్
- మునుగోడుతో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక..???