
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కుటుంబ సభ్యులు లేదా మిత్రులు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్ధం పేదలకు, అనాథ శరణాలయాల్లో ఉన్న వారికి ఆహారం అందించం లేదా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారాన్ని ఇవ్వడం వంటివి చాలా చోట్ల జరుగుతుంది. అయితే ఇందంతా ఓల్డ్ మోడల్ అనుకున్నాడో ఏమో కాని మరణించిన తన కొడుకు జ్ఞాపకార్ధం సూర్యపేటకు చెందిన ఓతండ్రి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎవరి ఆలోచనలకు తట్టని విధంగా ఆలోచించి పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కాస్తంత ఉపశమనం కలిగించాడు ఆతండ్రి.
Read Also : కేసిఆర్ పర్యటనకు ముందు ఇందూరులో బిజేపి భహిరంగసభ…
ఎన్ని దానాలు చేసినా , ఎంత సేవ చేసినా పుణ్యం కోసమేనని అందరూ భావిస్తారు. సూర్యపేటకు చెందిన ఒక వ్యాపారవేత్త గండూరి ప్రకాష్ కూడా అదే చేశారు. చనిపోయిన తన కుమారుడు వర్ధంతి సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఉచిత పెట్రోల్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వందలాది మంది వాహానదారులు పెట్రోల్ బంకు దగ్గర క్యూ లైన్లో నిల్చున్నారు. మరణించిన తన కుమారుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఒక్కో వాహనానికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందజేశారు.
Also Read : ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
వ్యాపారవేత్త గండూరి ప్రకాష్ కుమారుడు ప్రీతం జోనా వర్ధంతి రోజున ఏదైన చేయాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఎదో చేయాలనే ఆలోచనతో ఇలా చేశారు. ఇప్పటికే చనిపోయిన కొడుకు పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తోన్నారు. ప్రీతమ్ జోనా వర్ధంతి రోజున ఉచితంగా పెట్రోల్ అందించారు ప్రకాష్. మధ్యాహ్నం వరకు దాదాపు 1.3 లక్షలతో 1200 మందికి పైగా ఉచిత పెట్రోల్ పంపిణీ చేశారు. అయితే ఉచిత పెట్రోల్ వార్త దావానలంలా వ్యాపించడంతో ప్రజలు భారీ క్యాన్లను కూడా తీసుకుని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చినప్పటికి ప్రకాష్ పంపిణి విషయంలో కొన్ని నిబంధనలు పెట్టడంతో చాలా మంది వెనుదిరిగారు.
Read Also : అత్తింటి వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య…
తన కుమారుడు వర్ధంతికి జ్ఞాపకార్ధం ఏదైనా చేయాలని భావించానని ఇప్పటికే ఆహారం, రోగులకు పండ్లు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. అందుకే కొత్తగా ఆలోచించి ఫ్రీ పెట్రోల్ అందించాలని అనుకున్నామని తెలిపారు. పెట్రోల్ ధర సామాన్యుల జేబులకు చిల్లులు పడేలా చేస్తోంది. కాబట్టి కొంతలో కొంత ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతో రోజువారి కూలీలతో పాటు కొన్ని వర్గాల వారిక ఉచితంగా పెట్రోల్ అందించాలనే ఆలోచనతో ఈకార్యక్రమం నిర్వహించామన్నారు ప్రకాష్.
ఇవి కూడా చదవండి :
- కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర ఆర్దిక మంత్రి సీతారామన్ ఫైర్…. అరగంట టైమ్
- తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన….
- మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’….
- దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ…..
One Comment